జేఈఈఅడ్వాన్‌సడ్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి : ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్‌స ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్‌సడ్ ఫలితాలు విడుదలైనాయి.
తెలుగు విద్యార్థులకు ఈసారి నిరాశే మిగిలింది. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు మొదటి 10 స్థానాల్లో కచ్చితంగా చోటు లభించేది. ఈ ఏడాది మాత్రం టాప్-10 ర్యాంకులకు ఆమడదూరంలో నిలిచిపోయారు. వడ్డెల ఆశ్రుత్ జాతీయస్థాయిలో 17వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు, జేఈఈ మెయిన్‌లో 6వ ర్యాంకు సాధించిన వలిబిశెట్టి మోహన్ అభ్యాస్‌కు అడ్వాన్‌సడ్‌లో 64వ ర్యాంకు లభించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన కె.చిన్మయసాయి నాగేంద్ర జేఈఈ అడ్వాన్‌సడ్‌లో 70 ర్యాంకు సాధించాడు. పశ్చిమ గోదావర జిల్లా తణుకుకు చెందిన నరేన్ రాహుల్ ఎస్సీ కేటగిరీలో ఆలిండియా ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన దివ్యాంగురాలు అమృత వర్షిణి పీహెచ్ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించింది.
జేఈఈ అడ్వాన్‌సడ్-2017 ఫలితాలను మద్రాస్ ఐఐటీ ఈనెల 11న ప్రకటించింది. చండీగఢ్‌కు చెందిన సర్వేష్ మెహతానీ అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తం 366 మార్కులకుగాను సర్వేష్ 339 మార్కులతో సత్తా చాటాడు. పుణెకు చెందిన అక్షత చుఘ్(335 మార్కులు) రెండో ర్యాంకును, ఢిల్లీకి చెందిన అనన్య అగర్వాల్(331 మార్కులు) మూడో ర్యాంకును దక్కించుకున్నారు. మహిళల్లో రమ్యా నారాయణస్వామి ఫస్ట్ ర్యాంకు (అఖిలభారత స్థాయిలో 35వ ర్యాంకు) సాధించింది. అడ్వాన్‌సడ్ పరీక్ష ఫలితాలను https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఐఐటీ-జేఈఈ మెయిన్ పరీక్షలో 2.2 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్‌సడ్‌కు అర్హత సాధించారు. వీరిలో 1,72,024 మంది జేఈఈ అడ్వాన్‌సడ్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మే 21న జరిగిన పరీక్షకు 1,59,540 మంది హాజరయ్యారు. వీరిలో 50,455 మంది అడ్వాన్‌సడ్‌లో అర్హత సాధించారు. వీరిలో బాలురు 43,318, బాలికలు 7,137 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ఉన్న దాదాపు 11,000 సీట్ల కోసం వీరంతా పోటీ పడ్డారు. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 15వ తేదీ నుంచి కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాసేందుకు రిజిస్ట్రేషన్‌కు ఐఐటీ మద్రాసు అవకాశం కల్పించింది. ఏఏటీని ఈనెల 14న నిర్వహించి, 18న ఫలితాలను విడుదల చేయనుంది.
కఠోర శ్రమే విజయ రహస్యం: సర్వేష్ మెహతానీ
కఠోర శ్రమ, లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరించి చదవడమే తన విజయ రహస్యమని జేఈఈ అడ్వాన్‌సడ్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ సర్వేష్ మెహతానీ స్పష్టం చేశాడు. టీవీలో కార్టూన్లు చూడటం, సంగీతం వినడం, బ్యాడ్మింటన్ ఆడటం.. ఇవే తనను ఒత్తిడికి దూరంగా ఉంచేవని చెప్పాడు. రెండేళ్లుగా తాను సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపాడు. సర్వేష్ తండ్రి పర్వేష్ ఆదాయపు పన్ను శాఖలో అధికారి. జేఈఈ మెయిన్‌లో 55వ ర్యాంకు సాధించిన సర్వేష్.. అడ్వాన్‌సడ్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం గమనార్హం.

Published date : 12 Jun 2017 02:27PM