జేఈఈ అడ్వాన్‌సడ్ పరీక్ష రాసే విద్యార్థులకు సూచనలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం ఈనెల 21న నిర్వహించే జేఈఈ అడ్వాన్‌సడ్ పరీక్షకు మద్రాసు ఐఐటీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులను గంట ముందు నుంచే పరీక్షహాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపరు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది హాజరుకానుండగా.... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 31,695 మంది హాజరుకానున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో.. ఏపీలో విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష ఫలితాలను జూన్ 11వ తేదీన విడుదల చేస్తారు. అదే నెల 19 నుంచి జూలై 18 వరకు అడ్మిషన్లు జరుగుతారుు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: విద్యార్థులు అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్), ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. వీటితోపాటు బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్నులు, పెన్సిళ్లను మాత్రమే పరీక్షహాల్లోకి అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు తదితర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, జామెట్రీ బాక్స్ వంటి మేథమెటికల్ పరికరాలను తీసుకురానివ్వరు. అంతేగాకుండా ఎలాంటి కాగితాలు, పర్సులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు వంటి వాటిని.. పెద్ద గుండీలు కలిగిన దుస్తులను ధరించకూడదు. కాగా.. అంధులు, డిస్లెక్సియాతో బాధపడే వారికి స్క్రైబ్‌కు (సహాయకులు) అవకాశం ఉంటుంది. వారికి అదనంగా మరో గంట సమయం ఇస్తారు.

Published date : 20 May 2017 06:10PM