Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్ ‘కీ’ విడుదల

సాక్షి, అమరావతి: జాతీయస్థాయి విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌-2017 పరీక్ష ‘ కీ ’ ఈనెల 4న విడుదలైంది.
 జేఈఈ అడ్వాన్సుకు సంబంధించి పేపర్-1, పేపర్-2కు సంబంధించిన కీలను జేఈఈ అడ్వాన్స్‌ నిర్వహణ సంస్థ ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈనెల 6వ తేదీ వరకు ఈ కీపై అభ్యర్ధులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియచేయడానికి అవకాశముంది. ఈనెల 11వ తేదీన జేఈఈ అడ్వాన్సు పరీక్ష ఫలితాలు ఈనెల 11వ తేదీన విడుదల కానున్నాయి. 
అర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)కి ఈనెల 11, 12 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 14న ఏఏటీ పరీక్ష జరుగుతుంది. ఫలితాలను ఈనెల 18న విడుదల చేస్తారు. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర సంస్థల్లో సీట్ల కేటాయింపునకు సంబందించిన ప్రక్రియ నెల 15వ తేదీనుంచి ప్రారంభమవుతుంది. చాయిస్ ఫిల్లింగ్, సీట్ల అలాట్‌మెంటుతో ఈనెల 19వ తేదీతో ఈ ప్రకియ ముగుస్తుంది.
Published date : 05 Jun 2017 03:01PM

Photo Stories