జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 ‘ఆన్‌లైన్’పై ఆందోళన వద్దు..
Sakshi Education
జేఈఈ అడ్వాన్స్‌డ్.. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. తొలిసారిగా దీన్ని (2018లో) ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థుల్లో ఎక్కడలేని ఆందోళన, గందరగోళం తలెత్తింది. అయితే ఆన్‌లైన్ విధానంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ చైర్మన్, జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 నిర్వాహక సంస్థ ఐఐటీ-కాన్పూర్ ఎక్స్-అఫీషియో డెరైక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్.
జనవరిలో పూర్తి నోటిఫికేషన్..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 పరీక్ష తేదీని ఇప్పటికే ఖరారు చేశాం. జనవరిలో పూర్తి నోటిఫికేషన్, సిలబస్, అర్హతా ప్రమాణాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదలవుతుంది. జేఈఈ-మెయిన్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అడ్వాన్స్‌డ్ నోటిఫికేషన్ ఆలస్యం కారణంగా పరీక్షకు అనుకున్న విధంగా సన్నద్ధం కాలేకపోతున్నామనే విద్యార్థుల అభిప్రాయం సరికాదు. నిబంధనల ప్రకారం జేఈఈ మెయిన్ ఉత్తీర్ణుల నుంచి 2.24 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేయనున్నట్లు హెచ్‌ఆర్‌డీ ప్రకటించింది. కాబట్టి తదనుగుణంగా విద్యార్థులు ముందు మెయిన్ ప్రిపరేషన్‌ను పూర్తిచేయాలి.
తొలిసారిగా ఆన్‌లైన్ విధానం :
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో విద్యార్థుల్లో కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమే. అయితే నేను విద్యార్థులకు ఇచ్చే సూచనేమంటే..అనవసర ఆందోళనలకు స్వస్తి పలకాలి. ఆన్‌లైన్ విధానంతో కలిగే ప్రయోజనాలను గుర్తించాలి. ఆఫ్‌లైన్ విధానంతో పోల్చితే ఆన్‌లైన్‌లో విద్యార్థులకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు ఆదా అవుతుంది. దీన్ని గుర్తించి విద్యార్థులు ఆన్‌లైన్ విధానంపై అవగాహన పెంచుకోవాలి.
మాక్ టెస్ట్ సదుపాయం :
విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంపై అవగాహన పెంపొందించేందుకు తాజాగా అడ్వాన్స్‌డ్-2018 వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవాలి. త్వరలో వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్‌కు సంబంధించి హెల్ప్ వీడియో పేరుతో ప్రత్యేక విభాగాన్ని పొందుపరుస్తాం. వీటన్నింటినీ వినియోగించుకుంటే ఆన్‌లైన్ టెస్ట్‌పై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడటం ఖాయం. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ కోణంలోనూ ప్రాక్టీస్ చేయాలి.
ప్రశ్నల క్లిష్టత స్థాయి :
పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో ప్రశ్నల క్లిష్టత స్థాయిలో వ్యత్యాసాలు ఉంటాయనే అభిప్రాయం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్ టెస్ట్ కాబట్టి విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నలు రావడం సహజం. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ప్రశ్నల క్లిష్టతస్థాయి ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మూల్యాంకన, ఫలితాల నిర్ధారణ విషయంలోనూ ప్రత్యేక విధానాన్ని అనుసరించనున్నాం. కాబట్టి విద్యార్థులు ఆన్‌లైన్ స్లాట్, ప్రశ్నల క్లిష్టత స్థాయి గురించినఆలోచనలను వీడాలి. పరీక్ష విధానం, ప్రశ్నల తీరుతెన్నులపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. దీన్ని నిపుణుల కమిటీ నిర్ధారిస్తుంది. విద్యార్థులు ప్రశ్నను ఏ రీతిలో అడిగినా సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలి.
ఎన్‌టీఏ.. ప్రారంభ దశలోనే..
జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఉద్దేశించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఐఐటీలు ఎన్‌టీఏ పరిధిలోకి వెళ్లేందుకు అంగీకరిస్తాయా? లేదా? అనే విషయం ఎన్‌టీఏ పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలయ్యాక ఆలోచించాల్సిన విషయం. ఐఐటీ కౌన్సిల్ తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉంటుంది.
ఐఐటీలకు ప్రత్యేక పరీక్ష :
ఐఐటీలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు. ఇక్కడి విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాల వల్లే ఐఐటీలకు ఇంతటి పేరొచ్చింది. విద్యార్థుల ఎంపికకు ఐఐటీలు అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రతిభావంతులు మాత్రమే ప్రవేశాలు పొందగలగుతున్నారు. భవిష్యత్‌లో కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది.
వైవిధ్యానికి ప్రాధాన్యం...
జెండర్ డైవర్సిటీ పరంగా ఐఐటీలు ప్రత్యేక చర్యల తీసుకుంటున్నాయి. ఇప్పటికే మహిళా విద్యార్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఇచ్చాం. అదేవిధంగా వచ్చే ఏడాది (జేఈఈ- అడ్వాన్స్‌డ్)-2018 నుంచి 14 శాతం సీట్లను (సూపర్ న్యూమరరీ) మహిళలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి గత మూడేళ్ల నుంచి ఐఐటీల్లో మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
వాస్తవిక దృక్పథం, సామాజిక స్పృహ..
ఐఐటీల్లో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు పరీక్ష కోణంలో వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి. కేవలం బుక్ రీడింగ్‌కే పరిమితం కాకుండా విషయ అవగాహనను పెంపొందించుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐఐటీల్లో అడుగుపెట్టిన తర్వాత అన్నింటా ముందుండాలంటే ఇప్పటి నుంచే సామాజిక స్పృహను పెంపొందించుకోవాలి. సామాజిక స్పృహ కొరవడటం, బిడియం, బెరుకు వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ఐఐటీ వాతావరణంలో ఇమడలేకపోతున్నారు.
ఇంజనీరింగ్ సర్వస్వం కాదు...
ఎంపీసీ విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్, ఐఐటీలనే గమ్యాలుగా చూడకూడదు. చాలామందిలో ఇలాంటి ఆలోచనలే ఉంటున్నాయి. వీరంతా ఫలితం అనుకూలంగా రానప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రుల దృక్పథం సైతం మారాలి. ‘ఇంజనీరింగ్‌తోనే కెరీర్’ అని భావించకుండా ఎంపీసీతో లభించే ఇతర అవకాశాల గురించి కూడా తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల్లో ఇంజనీరింగ్ చదివే సామర్థ్యం ఉందా? లేదా? అని గుర్తించి.. దానికి అనుగుణంగా ముందుకు సాగాలి.

Published date : 27 Dec 2017 12:21PM