ఇంటర్మీడియెట్ విద్యార్థుల డిజిటల్ తరగతులకు బ్రేక్..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ విద్యార్థులకు దూరదర్శన్, టి-సాట్ ద్వారా అందించాలనుకున్న డిజిటల్ తరగతుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
ఈ నెల 17న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించాల్సిన ఈ డిజిటల్ తరగతుల కార్యక్రమాన్ని గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రద్దు చేశామన్నారు. త్వరలోనే ప్రారంభ తేదిని ప్రకటిస్తామని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
Published date : 17 Aug 2020 05:16PM