Skip to main content

ఇంటర్‌లో తప్పనిసరి ద్వితీయ భాషగా తెలుగు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా అమలు చేయడంపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ నివేదికను ఖరారు చేసింది.
నవంబర్ 19న ఇంటర్ బోర్డులో జరిగిన సమావేశంలో తెలుగు అమలుకు సంబంధించిన అంశాల పై చర్చించింది. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక ప్రభుత్వాలు అధికార/ప్రాంతీయ భాషలను ఒకటి నుంచి పదో తరగతి వరకు చదవాల్సిందేనని చేసిన చట్టాలను, నివేదికలను పరిశీలించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లు ఇంటర్‌లో తెలుగు తప్పనిసరి అమలుకు తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదికను అందజేయనుంది.

కమిటీ సిఫార్సులు ఇవీ..
  1. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం వారికి తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంది. ఇంగ్లిష్, ఇతర మీడియంల వారికి తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయాలి. ద్వితీయ భాషగా దీన్ని ఎంచుకోవాలి.
  2. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు సీబీఎస్‌ఈకి లేఖ రాయాలి. 11, 12 తరగతుల్లో తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగాగానీ, ప్రధాన సబ్జెక్టుగాగానీ చదువుకోవాలి.
  3. టెన్త్ వరకు తెలుగు ఓ సబ్జెక్టుగా, తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇంటర్‌లో ద్వితీయ భాషగా తెలుగు చదవాల్సిందే.
  4. టెన్త్ వరకు తెలుగు మినహా ఇతర మాధ్య మాల్లో చదువుకున్న వారు ద్వితీయ భాషగా 50 మార్కులకు తెలుగును, మిగతా మా ర్కులకు నచ్చిన సబ్జెక్టు ఎంచుకోవచ్చు.
Published date : 20 Nov 2017 04:50PM

Photo Stories