ఇంటర్లో గ్రేడింగ్ విధానం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి మాదిరిగానే ఇంటర్లోనూ ర్యాంకుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో అక్టోబర్ 16న సీఎం చంద్రబాబు, మంత్రి గంటా, డీజీపీ సాంబశివరావు తదితరులు.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ వివరాలను మంత్రి గంటా మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ర్యాంకుల విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను రోజుకు పద్దెనిమిదిన్నర గంటల పాటు చదివిస్తున్నారని, దీంతో ఒత్తిడికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కాలేజీల యాజమాన్యాలు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇకపై విద్యార్థులకు ఆదివారం సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం..
కార్పొరేట్ కళాశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల బలవన్మరణాలపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్టు గంటా తెలిపారు. ఇందులో అధికారులు, కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారని వివరించారు. ఈ కమిటీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహిం చి నివేదిక ఇస్తుందని, దీని ఆధారంగా చర్యలు తీసు కుంటామన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు కాలేజీల హాస్టళ్లు 150కి పైగా ఉన్నాయని.. మూడు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోకపోతే వాటిని రద్దు చేస్తామన్నారు. వ్యా యామం, యోగా, క్రీడా తరగతులు నిర్వహించాలని కాలేజీలను ఆదేశించారు.
ఇంటర్ బోర్డు త్వరలో మార్గదర్శకాలు జారీ...
కార్పొరేట్ కాలేజీల్లో బోధనా పద్ధతులు, పనితీరు, పని గంటలు తదితర అంశాలపై ఇంటర్ బోర్డు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తుందని మంత్రి చెప్పారు. కాలేజీలు వీటిని తప్పనిసరిగా పాటించాలన్నారు.

Published date : 17 Oct 2017 03:01PM