ఇంటర్ వొకేషనల్‌లో సమూల మార్పులు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కాఫీ తాగేందుకు ఇష్టపడే వారు అత్యధికమే. అలాంటి కాఫీ ప్రియుల కోసం 42 రకాల కాఫీలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. ఆర్థిక స్తోమత లేక ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఏదో ఉద్యోగమో.. ఉపాధో పొందాలనుకునే వారు కాఫీ మేకింగ్ కోర్సు చదువుకుంటే సరి. ఈ కోర్సు చేస్తే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓ కాఫీ షాప్ పెట్టుకోవచ్చు.
బేకరీ మేకింగ్. ఇదీ అంతే. బేకరీ వస్తువుల తయారీలో శిక్షణ పొందడం ద్వారా బేకరీ రంగంలోనూ స్థిర పడవచ్చు. అలాగే ఫ్లవర్ బొకే మేకింగ్ కూడా అంతే. ఈ మధ్యకాలంలో వస్తున్న మరో ట్రెండ్ డ్యూటీ కేర్ మేనేజ్‌మెంట్. ముఖ్యంగా ఉద్యోగులైన భార్యాభర్తలు ఇంట్లో ఉండే తమ వృద్ధులైన తల్లిదండ్రులను తమ ఇంట్లో ఉండి చూసుకునే వారి కోసం వెంపర్లాడుతున్నారు. వేల రూపాయలు చెల్లించి నర్సులను నియమించుకుంటున్నారు. అలా సేవలందించాలనుకునే వారి కోసం వచ్చిన కోర్సు డ్యూటీ కేర్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డిమాండ్ పెరుగుతోంది. ఇవే కాదు.. వీటితోపాటు ఆటోమొబైల్ సర్వీసింగ్, మోటారు వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, టాయ్స్ మేకింగ్, అర్బన్ మైక్రో బిజినెస్, సోలార్ ఎనర్జీ వంటి అనేక కోర్సులను రాష్ట్రంలోని వొకేషనల్ ఇంటర్మీడియట్‌లో కోర్సులుగా అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్మీయట్ విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుల్లో సమూల సంస్కరణలకు ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ శ్రీకారం చుట్టారు. వొకేషనల్ కోర్సు చేసే విద్యార్థి ఉద్యోగంలో లేదా సొంతంగా ఉపాధి పొందేలా ఉండాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో మార్పులను తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఇలాంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
సెంచూరియన్ వర్సిటీలో అధ్యయనం..
రాష్ట్రంలోని వొకేషనల్ విద్యలో మార్పులు తేవాలని నిర్ణయించిన ఇంటర్ బోర్డు.. ఇలాంటి వొకేషనల్ కోర్సులను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీలో అధ్యయనం చేసింది. అక్కడ అమలు చేస్తున్న కోర్సులు, వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్, విద్యార్థులకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నివేదిక సిద్ధం చేస్తోంది. ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, జాయింట్ సెక్రటరీ భీమ్‌సింగ్, అసిస్టెంట్ డెరైక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ రాజశేఖర్, విశ్వేశ్వర్‌ల బృందం ఈ నెల 7న ఆ వర్సిటీలో అధ్యయనం చేసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని వీలైతే వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో సమూల మార్పులను, కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
ప్రాంతాన్ని బట్టి కోర్సులు..
కాఫీ మేకింగ్, బేకరీ మేకింగ్, ఫ్లవర్ బొకే మేకింగ్ వంటి కోర్సులకు, పనులకు పట్టణ ప్రాంతాల్లోనే డిమాండ్ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, మష్రూమ్ కల్చర్, మోటార్ వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్ వర్క్ వంటి కోర్సులకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అక్కడే వాటి అవసరం ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడ వాటిని నిర్వహించేలా ఇంటర్ విద్యా శాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిమాండ్ లేని కొన్ని కోర్సులను తొలగించే అంశాలను పరిశీలిస్తోంది. ప్రాంతాన్ని బట్టి డిమాండ్ ఉన్న కోర్సులను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 రకాల కోర్సులు ఉండగా, అందులో కొన్నింటిని తొలగించి 15 రకాల కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది.

Published date : 10 Dec 2019 04:22PM