ఇంటర్ వార్షిక పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులూ, మాల్ ప్రాక్టీస్‌లో బుక్ అయిన వారు... ఆల్ పాస్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తు న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్త ర్వులు జారీ చేశారు. పరీక్ష ఫీజు చెల్లించినా మార్చిలో జరిగిన పరీక్షలకు గైర్హాజరైన 27,251 మందిని, మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ అయిన 338 మందిని కలిపి మొత్తం 25,589 మందిని కనీస మార్కులతో (కంపార్ట్‌మెంట్) పాస్ చేశారు. కరోనా నేపథ్యంలో ఈ అవకాశం ఈ ఒక్కసారికే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
రేపటి నుంచి రివైజ్డ్ మార్కుల మెమోలు
పరీక్షలకు హాజరుకాని విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వారికి రివైజ్డ్ మార్కుల మెమోలను అందుబాటులో ఉంచుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. విద్యార్థులు రేపు సాయంత్రం 5 గంటల నుంచి tsbie.cgg.gov.in లో సవరించిన మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Published date : 04 Nov 2020 03:54PM