Skip to main content

ఇంటర్ ఫీజు చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్యకు పరిష్కారం

సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్యను సవరించామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా లక్షల మంది విద్యార్థుల వివరాలు గల్లంతు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు అధికారులు స్పందించారు. సమస్యను పరిష్కరించామని, కళాశాలల యాజమాన్యాలు అక్టోబర్ 31 వరకు యథావిధిగా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అయితే ఒక్క రోజులో లక్షల మంది విద్యార్థుల ఫీజు చెల్లింపు సాధ్యం అవుతుందా? కాదా? నిజంగానే సమస్య పరిష్కారం అయిందా? అన్నది అక్టోబర్ 31న తేలనుంది.
Published date : 31 Oct 2018 01:55PM

Photo Stories