ఇంటర్ హాజరు మినహాయింపు ఫీజు చెల్లింపు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మార్చి-2021 పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయివేటు (కాలేజీ చదవని) విద్యార్థులు అటెండెన్సు నుంచి మినహాయింపునకు డిసెంబర్ 18వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆలస్య రుసుము 200లతో డిసెంబర్ 24వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు.
Published date : 07 Dec 2020 04:45PM