ఇంటర్ గణితం పేపర్‌లో తప్పులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా జూన్ 9న జరిగిన మొదటి సంవత్సరం గణితం ప్రశ్నపత్రంలో మూడు తప్పులు దొర్లినట్లు విద్యార్థులు తెలిపారు.
పరీక్ష ముగిసే అర్ధగంట ముందు ఈ విషయాన్ని అధికారులు తమకు చెప్పారన్నారు. సెక్షన్ బీలోని 14, 16 ప్రశ్నలు...అలాగే పార్టు 3లోని 22వ ప్రశ్న సైతం తప్పుగానే వచ్చిందని తెలిపారు. ఈ అంశంపై ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు స్పందించాలని కోరారు.
Published date : 10 Jun 2019 04:30PM