గురుకుల జూనియర్ కళాశాలల్లో 96.9 శాతం ఉత్తీర్ణత
Sakshi Education
ఇంటర్ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ఏపీఆర్‌ఈఐ సొసైటీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్ బోర్డు ఏప్రిల్ 12న ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గురుకుల జూనియర్ కళాశాలలు అత్యధికంగా 96.8 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) కార్యదర్శి ఎం.నాగభూషణ శర్మ తెలిపారు. గుంటూరులోని ఏపీఆర్‌ఈఐఎస్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 10 ఏపీఆర్‌జేసీల వారీగా సాధించిన ఫలితాలను ఆయన విడుదల చేశారు. విద్యాశాఖకు అనుబంధంగా నిర్వహిస్తున్న గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 92 శాతం, ద్వితీయ సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు. ఏపీఆర్‌జేసీ నాగార్జునసాగర్ (95.5 శాతం), నిమ్మకూరు (98.3 శాతం), కొడిగెనహళ్లి (98 శాతం), గ్యారంపల్లి (100 శాతం), తాటిపూడి (99 శాతం), వెంకటగిరి (96.7 శాతం), బనవాసి (97 శాతం), గుంటూరు ఉర్దూ బాలుర (94.6 శాతం), కర్నూలు ఉర్దూ (88.2 శాతం), వాయలపాడు (96.5 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్షలకు హాజరైన 1,125 మంది విద్యార్థుల్లో 1,089 మంది ఉత్తీర్ణులై 96.8 శాతం నమోదైనట్లు వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీఆర్‌జేసీలు, మహాత్మాగాంధీ పూలే బీసీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 9న జరగనున్న ప్రవేశ పరీక్షకు ఈనెల 15 లోపు దరఖాస్తు చేయాలని సూచించారు.
Published date : 13 Apr 2019 03:45PM