ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ–2021 పరీక్షల షెడ్యూల్ విడుదల
చదవండి: ఆగస్టు నెలాఖరుకల్లా ఆరోగ్య శాఖలో 3,390 ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలు భర్తీ..!
చదవండి: ఆగస్ట్ 7లోగా ఏపీ టెన్త్– 2021 ఫలితాలు.. ఈ విధంగానే మార్కులు..
ఉన్నత చదువులకు వీలుగా హైపవర్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇటీవల ఇంటర్ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఆ విద్యార్థుల టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. ఫస్టియర్ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది. సెకండియర్ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. ఫస్టియర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయవలసి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆగస్టు 17లోపు చెల్లించాలి. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులంతా ఈ గడువులోగా ఫీజులు చెల్లించాలి. పబ్లిక్ పరీక్షలకు ఇంతకు ముందు ఫీజు చెల్లించిన ఫస్టియర్ విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. బెటర్‌మెంట్ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనుకునే సెకండియర్ విద్యార్థులు కూడా ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకు ముందు వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అటెండెన్స్ మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలి. 2019లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బెటర్‌మెంట్ మార్కుల కోసం ఈ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం. పరీక్షల తేదీలను పొడిగించబోమని బోర్డు కార్యదర్శి రామకృష్ణ చెప్పారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా..
తేదీ | ఫస్టియర్ | సెకండియర్ |
15–09–2021 | ద్వితీయ భాష పేపర్–1 | ద్వితీయ భాష పేపర్–2 |
16–09–2021 | ఇంగ్లిష్ పేపర్–1 | ఇంగ్లిష్ పేపర్–2 |
17–09–2021 | మ్యాథ్స్ పేపర్–1ఏ, బోటనీ పేపర్–1, సివిక్స్ పేపర్–1 | మ్యాథ్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2 |
18–09–2021 | మ్యాథ్స్ పేపర్–1బి, జువాలజీ పేపర్–1, హిస్టరీ పేపర్–1 | మ్యాథ్స్ పేపర్–2బి, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2 |
20–09–2021 | ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1, కెమిస్ట్రీ పేపర్–1 | ఫిజిక్స్ పేపర్–2, ఎకనామిక్స్ పేపర్–2 |
21–09–2021 | కామర్స్ పేపర్–1, సోషియాలజీ పేపర్–1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 | కెమిస్ట్రీ పేపర్–2, కామర్స్ పేపర్–2, సోషియాలజీ పేపర్–2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–2 |
22–09–2021 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్–1, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్–1(బైపీసీ వారికి), మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్–1 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్–2, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్–2 (బైపీసీ వారికి) |
23–09–2021 | జియోగ్రఫీ పేపర్–1 | మోడర్న్ లాంగ్వేజ్ పేపర్–2, జియోగ్రఫీ పేపర్–2 |