Intermediate Examinations 2024: పరీక్షలకు ఎంపిక చేసే కేంద్రాలపై అధికారుల కసరత్తు..!
కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు వసతులు, భద్రత, రవాణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రాల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్‌ఐవో, డీవీఈవోల నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో కాలేజీలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో నిర్వహిస్తున్న 168 కాలేజీలకు 2023–24 విద్యా సంవత్సరానికి ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. వీటిలో మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న 77,175 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మరో 5,221 మంది ప్రైవేటు (గతంలో పరీక్షలు తప్పినవారు) పరీక్షలు రాయనున్నారు.
MOU: విదేశీ వర్సిటీలతో ఎంవోయులు
పారదర్శకంగా పరీక్షలు
పరీక్షలు సజావుగా నిర్వహించడంలో కేంద్రాల ఎంపిక కీలకం కానుంది. అందుకనే ఇంటర్ బోర్డు అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా కేటాయించిన రూమ్‌లో ఒక్కో బెంచిపై ఇద్దరు విద్యార్థులకు మాత్రమే సీటింగ్ కేటాయించేలా కేంద్రాలను గుర్తిస్తున్నారు. ఐదు అడుగులలోపు ఉన్నట్‌లైతే ఒక్క విద్యార్థికే సీటింగ్ కేటాయించనున్నారు. మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2న, ఎథిక్స్, 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది. వీటి నిర్వహణకు జిల్లాలో 1,751 మంది అధ్యాపకుల వివరాలను ఆన్‌లైన్‌లో ఇప్పటికే నమోదు చేశారు.
Job Mela: డీఎల్‌టీసీ ఐడీఐ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా
ఆ కాలేజీలకు నో చాన్స్
పరీక్ష కేంద్రాల ఎంపికలో ఇంటర్ బోర్డు అధికారులు ఈసారి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. విశాఖలో కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో రెసిడెన్షియల్ పేరిట హాస్టళ్లు సైతం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో, జిల్లా అధికారులు సమగ్ర పరిశీలన చేస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరం వరకు ఉన్న జాబితాలో జిల్లాలో 78 కాలేజీల్లో కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి వీటిలో 23 కాలేజీలను పక్కన పెట్టారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వీటి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.
Degree Exams: డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్
జిల్లాలో పెరగనున్న కేంద్రాలు
ఈ ఏడాది జిల్లాలో ఇంటర్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసేందుకు అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. గుర్తించిన కాలేజీల్లో అందుబాటులో ఉన్న రూములు, అక్కడ ఉన్న వసతులను పరిగణలోకి తీసుకొని 90 కేంద్రాలను ఎంపిక చేసేలా ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
Suchindra Rao: సైన్స్ ఫెయిర్‌కు సన్నద్ధం
పకడ్బందీగా కేంద్రాల ఎంపిక
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బోర్డు ఉన్నతాధికారుల నుంచి సూచనల మేరకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్న కాలేజీలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే 60 కాలేజీలను గుర్తించి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. మరో 35 కేంద్రాల పరిశీలన జరుగుతోంది. సాధ్యమైనంత త్వరలోనే వీటి ఎంపిక పూర్తి చేస్తాం.
– రాయల సత్యనారాయణ, ఆర్‌ఐవో, ఉమ్మడి విశాఖ జిల్లా
Law Admissions: మహిళా ‘లా’ గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
సౌకర్యాలన్నీ ఉంటేనే సిఫార్సు
ఇంటర్ పరీక్షలకు మెరగైన సౌకర్యాలు ఉన్న కాలేజీలనే గుర్తిస్తున్నాం. ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. మా వద్ద అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో కాలేజీలను పరిశీలిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా కేంద్రాల జాబితా సిద్ధం చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం.
– బి.రాధ, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి, విశాఖ