Skip to main content

MOU: విదేశీ వర్సిటీలతో ఎంవోయులు

భువనేశ్వర్‌: బోధన, పరిశోధన రంగాల్లో సహకార అవకాశాలను అన్వేషించే లక్ష్యంతో స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) మూడు విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జ‌నవ‌రి 8న‌ కుదుర్చుకుంది.
MoUs with foreign universities    International collaborations   IIT Bhubaneswar signs MoU with international universities for collaboration

ఈ సంస్థ బల్గేరియాకు చెందిన ప్లోవ్‌డివ్‌ యూనివర్సిటీ పైసీ హిలెన్‌డార్‌స్కి, బంగ్లాదేశ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, బంగ్లాదేశ్‌లోని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఐఐటీ భువనేశ్వర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీపాద్‌ కర్మల్కర్‌, ప్లోవ్‌డివ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రుమెన్‌ మ్లాడెనోవ్‌ రెక్టార్‌, ప్లోవ్‌డివ్‌ యూనివర్సిటీ పైసీ హిలెండర్‌స్కీలు ఎంవోయూపై సంతకాలు చేశారు.

చదవండి: OU Diploma Admission Notification 2024-విదేశీ భాషల్లో డిప్లొమా కోర్సులకు ఆహ్వానం

బంగ్లాదేశ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందాలపై ఐఐటీ భువనేశ్వర్‌ ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ కుమార్‌ సాహు, డీన్‌ (అలుమ్ని అఫైర్స్‌ మరియు ఇంటర్నేషనల్‌ రిలేషన్‌న్స్‌), ప్రొఫెసర్‌ మహ్మద్‌ జారెజ్‌ మియా, బంగ్లాదేశ్‌లోని జహంగీర్‌నగర్‌ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్‌ ఎం.షమీమ్‌ కై జర్‌ ప్రాతినిధ్యం వహించి సంతకం చేశారు. వివిధ సంయుక్త పథకాలు, అధ్యాపక మార్పిడి కింద విద్యావేత్తలు మరియు పరిశోధనలలో సహకార సంబంధాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఐఐటీ భువనేశ్వర్‌ మరియు విదేశీ విశ్వవిద్యాలయాల మధ్య ఈ మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీపాద్‌ కర్మల్కర్‌ తెలిపారు.

యూకే, బల్గేరియా, బంగ్లాదేశ్‌, లాత్వియా, బెల్జియం, టర్కీ మరియు భారతదేశం నుంచి వివిధ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల నుండి దాదాపు 40 మంది ప్రతినిధులు ఈ సంస్థను సందర్శించిన సందర్భంగా ఐఐటీ భువనేశ్వర్‌ డీన్లు, అధ్యాపకుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి.

Published date : 10 Jan 2024 12:09PM

Photo Stories