ఆగస్టు 17 నుంచే ఇంటర్ ఆన్‌లైన్ తరగతులు : ఇంటర్ బోర్డు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువులు పున: ప్రారంభం కానున్నాయి.
ఆగస్టు 17వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీశాట్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచించింది. అలాగే కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్స్ ఇతర సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 14 Aug 2020 07:10PM