Skip to main content

84 కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఉండగా, అందులో 84 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
కేబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు కేంద్రం కేజీబీవీల్లో 12వ తరగతి వరకు నిర్వహణకు చర్యలు చేపట్టిందన్నారు. అందు లో భాగంగా 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వాటిల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. జూన్ 7న సచివాలయంలో టీచర్ల బదిలీ ల వెబ్‌సైట్‌ను కడియం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేజీబీవీల్లో ప్రస్తుతం ప్రతి సెక్షన్‌కు 20 మందినే తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని 40కి పెంచాలని, ఆర్‌‌ట్స, సైన్స్ గ్రూపులు ఉండేలా చూడాలని చేసిన సిఫారసుకు కేంద్రం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లోనూ కేజీబీవీ విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఇంటర్ సీట్లు లభించవన్న ఆందోళన ఉండదన్నారు. అప్‌గ్రేడ్ చేసిన ప్రతి మూడు కేజీబీవీల్లో రెండింటిలో సైన్స్ గ్రూపులు, ఒక దాంట్లో ఆర్‌‌ట్స గ్రూపులు ప్రవేశ పెడుతున్నామన్నారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఉన్న 6.25 లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. ఇందుకు సీఎం రూ.100 కోట్లు కేటాయించారన్నారు.
Published date : 08 Jun 2018 01:46PM

Photo Stories