Skip to main content

2020-21 విద్యా సంవత్సరానికి ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల:ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పబ్లిక్ పరీక్షలు ఎప్పుడంటే..

సాక్షి, అమరావతి : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు మార్చి చివరి వారంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరపు అకడమిక్ క్యాలెండర్‌ను సోమవారం విడుదల చేసింది. కరోనా కారణంగా దాదాపు ఐదు నెలల సమయం కోల్పోయిన నేపథ్యంలో ఏప్రిల్ చివరి వరకూ తరగతులు నిర్వహించేలా బోర్డు ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. మొత్తం 138 పనిదినాలు అందుబాటులో ఉన్నాయి. ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో, ప్రాక్టికల్ పరీక్షలు మార్చి మొదటి వారంలో, థియరీ ఫైనల్ పరీక్షలు మార్చి చివరి వారంలో నిర్వహిస్తారు. ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం ఏప్రిల్ 24. వేసవి సెలవులు ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ చివరి వారంలో నిర్వహిస్తారు. 2021-22 విద్యా సంవత్సరానికి కాలేజీలు జూన్ ఒకటోతేదీ నుంచి ప్రారంభమవుతాయి.

2020- 21 విద్యాసంవత్సరానికి సంబంధించిన జూనియర్, సీనియర్ ఇంటర్మీడియెట్ అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి.
Published date : 03 Nov 2020 04:25PM

Photo Stories