Skip to main content

MBA: ఈవెనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష.. పరీక్ష తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్రం ఓయూ క్యాంపస్‌లోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో ఎంబీఏ ఈవెనింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
OU
ఎంబీఏ ఈవెనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష..

ఎంబీఏ రెండేళ్ల టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ మూడేళ్ల పార్ట్‌టైం కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయించినట్లు ఓయూ పీజీ అడ్మిష¯Œ్స డైరెక్టర్‌ పాండురంగారెడ్డి జనవరి 11న తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి ఏదేని సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ హోదా గల ఉద్యోగులు ఎంబీఏ ఈవెనింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులన్నారు. జనవరి 23న 11 నుంచి 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష జరుగుతుందని, దీనికి జనవరి 22 వరకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఐసెట్‌–2021 అర్హత గల అభ్యర్థులు నేరుగా ప్రవేశం పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను 99855 60052 నంబర్‌కు ఫోన్ చేసి పొందవచ్చని తెలిపారు.

చదవండి: 

MCC: ఆలిండియా మెడికల్‌ ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌కు చివరి తేదీ ఇదే..

ఎంసీఏ కోర్సును రెండేళ్లకు కుదించిన ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఇంజనీరింగ్ కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీ లోగోను మార్చలేదు

Published date : 12 Jan 2022 03:47PM

Photo Stories