Skip to main content

ఎంసీఏ కోర్సును రెండేళ్లకు కుదించిన ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో కొనసాగుతున్న ఎంసీఏ కోర్సును మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదిస్తున్నట్లు రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి బుధవారం తెలిపారు.
ఐఏసీటీఈ ఆదేశాల మేరకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఓయూ పరిధిలోని 22 ఎంసీఏ కాలేజీల్లో ఈ కోర్సు రెండేళ్లు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఓయూ పరిధిలో 25 ఏళ్ల కిందట ప్రారంభమైన ఎంసీఏ కోర్సు ఇంతవరకు రెగ్యులర్ కోర్సుగా గుర్తింపు పొందలేదు. క్యాంపస్ కాలేజీలతో పాటు అన్నికాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుకు అధ్యాపకులు కానీ, కంప్యూటర్ ల్యాబ్ సిబ్బంది కానీ పర్మనెంట్ వారు లేకపోవడం గమనార్హం.
Published date : 09 Jul 2020 01:31PM

Photo Stories