Skip to main content

గిరిజన సంక్షేమం

తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.87 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వీరి శాతం 9.34.

అత్యధిక ఎస్టీ జనాభా, అత్యధిక ఎస్టీ జనాభా శాతం ఉన్న జిల్లా ఖమ్మం (27.37 శాతం). అత్యల్ప ఎస్టీ జనాభా, అత్యల్ప జనాభా శాతం ఉన్న జిల్లా హైదరాబాద్ (1.24 శాతం).

  • రాష్ట్ర అక్షరాస్యత 66.46 శాతం ఉండగా ఎస్టీల అక్షరాస్యత 49.51 శాతం మాత్రమే.
  • తెలంగాణలోని ప్రధాన గిరిజన సముదాయాలు
1) లంబాడీలు: 20,46,117
2) కోయలు: 4,86,391
3) గోండ్లు: 2,97,846
4) ఎరుకలు: 1,44,128
  • గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వీరికోసం అనేక సామాజిక, ఆర్థిక పథకాలు అమలు చేస్తోంది. విద్య, ఆర్థిక సహకారం, భూమి ఆధారిత పథకాల అమలుకు శ్రద్ధ తీసుకుంటోంది.
కొత్త పథకాలు
కొమురం భీమ్ మెమోరియల్ అండ్ ట్రైబల్ మ్యూజియం
  • ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ గ్రామం వద్ద రూ. 25 కోట్ల వ్యయంతో ప్రభుత్వం కొమురం భీమ్ స్మారక స్తూపం, మ్యూజియాన్ని నిర్మించనుంది. దీన్ని గిరిజన సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారు.
గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు అదనపు వసతులు
  • గిరిజన విద్యా సంస్థలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు కేటాయించారు.
  • ఈ నిధులతో ల్యాబ్, మౌలిక సౌకర్యాలు, సామగ్రి, పుస్తకాలు, మ్యాగజీన్లతో గ్రంథాలయాలు, డీటీహెచ్ కనెక్షన్‌తో ఎల్‌సీడీ టీవీ, డిజిటల్ ప్రొజెక్టర్లు, సోలార్‌వాటర్ హీటర్లు, ఆర్‌వో వాటర్ ప్లాంట్లు, డ్యుయల్ డెస్క్‌లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, దోమతెరలు, క్రీడా సామగ్రి సమకూర్చుతారు.
షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ (పీఈఎస్‌ఏ)
  • స్వయం పాలన, అధికారాల వికేంద్రీకరణ వంటి ప్రధాన సూత్రాల అమలుకు భరోసా కల్పిస్తూ షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు పీఈఎస్‌ఏ యాక్ట్ ఆమోదం తెలిపింది.
  • రాష్ట్రంలో 78 షెడ్యూల్డ్ ఏరియా మండలాలు, 690 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
  • 4127 గిరిజన ఆవాసాలు/పల్లెలతో కూడిన మొత్తం 1594 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించనున్నారు.
ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు
  • గిరిజన సంక్షేమ శాఖ 283 హాస్టళ్లను నిర్వహిస్తుంది. వీటిలో 85,843 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు.
  • వీటితో పాటు 40,763 మంది విద్యార్థులతో 212 హాస్టళ్లు, 20100 మంది విద్యార్థులతో 101 ప్రీమెట్రిక్ హాస్టళ్లు కొనసాగుతున్నాయి.
  • 2014 మార్చిలో నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో 84.21 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గురుకులం
  • 38,511 మంది విద్యార్థులతో 150 సంస్థలను గురుకులం నిర్వహిస్తోంది.
  • గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు 2014 పదో తరగతి పరీక్షలో 88.67 శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్ పరీక్షల్లో రాష్ర్టంలో 55.85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు 85.80 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్
  • అర్హులైన ఎస్టీ విద్యార్థులందరికీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు.
  • 1.50 లక్షల మంది విద్యార్థులకు రూ. 256.42 కోట్లు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారు.
  • ఈ స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పంపిణీ చేశారు.
తెలంగాణ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఆర్‌ఐసీఓఆర్)
  • పేదరిక రేఖకు దిగువన ఉన్న ఎస్టీలకు ప్రయోజనం కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
  • టీఆర్‌ఐసీఓఆర్ ద్వారా ఆర్థిక మద్దతు పథకాలను అమలు చేస్తారు.
  • 2014-15 ఆర్థిక సంవత్సరంలో 25,765 మంది ఎస్టీ లబ్ధిదారులకు సహకారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
అటవీ హక్కుల చట్టం - 2006 అమలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్)
  • అటవీ వాసుల హక్కులను గుర్తించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.
  • ఈ చట్టం నిర్దిష్ట కమ్యూనిటీ హక్కులతో పాటు చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకునే హక్కులను కల్పిస్తుంది.
  • ఈ చట్టం కింద 95,022 మందికి 8,09,059 ఎకరాల అటవీ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేశారు.
1/70 చట్టం అమలు
  • ఈ చట్టం కింద 1,05,590 ఎకరాల భూమి కి సంబంధించి 31,188 భూ బదలాయింపు కేసులను గిరిజనులకు అనుకూలంగా పరిష్కరించారు.

మాదిరి ప్రశ్నలు

1. కింది వాటిలో ఎస్సీ జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్
2) హైదరాబాద్
3) మహబూబ్‌నగర్
4) రంగారెడ్డి
సమాధానం: 2
2. తెలంగాణ ఎస్టీల్లో స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత?
1) 980 : 1000
2) 977 : 1000
3) 938 : 1000
4) 1009 : 1000
సమాధానం: 1
3. ఎస్టీ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న జిల్లా?
1) రంగారెడ్డి
2) మెదక్
3) నల్గొండ
4) హైదరాబాద్
సమాధానం: 4
4. ఎస్టీ మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా?
1) మహబూబ్‌నగర్
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) నల్గొండ
సమాధానం: 2
Published date : 04 Sep 2015 05:20PM

Photo Stories