ఏపీలో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
1. మునిసిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది?
1) రిప్పన్ తీర్మానం – 1882
2) మొదటి చార్టర్ చట్టం – 1793
3) మేయో తీర్మానం – 1872
4) రెండో చార్టర్ చట్టం – 1813
- View Answer
- సమాధానం: 2
2. మౌలిక భారత రాజ్యాంగంలో (1950) పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేది..?
1) తప్పనిసరి
2) న్యాయ సమ్మతం
3) ఐచ్ఛికం
4) న్యాయ వ్యవస్థ మద్దతు
- View Answer
- సమాధానం: 3
3. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో 1957లో బల్వంత్రాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో లేని అంశం?
1) పార్టీయేతర ఎన్నికలు నిర్వహించాలి
2) గ్రామపంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి
3) స్థానిక సంస్థల పదవీ కాలం ఐదేళ్లు
4) స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి
- View Answer
- సమాధానం: 4
4. ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన – పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీకి అధ్యక్షుడు?
1) జి.వి.కె. రావు కమిటీ
2) దంత్వాలా కమిటీ
3) హన్మంతరావు కమిటీ
4) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
- View Answer
- సమాధానం: 1
5. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనవి?
ఎ) దీన్ని 9, 9అ భాగంలో పొందుపరిచారు
బి) 243 – 243(ౖ) ఆర్టికల్ వరకు పొందుపరిచారు
సి) 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ, 29 అంశాలపై అధికారం కల్పించారు.
1) ఎ, బి
2) బి, సి
3) సి, ఎ
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
6. స్థానిక ప్రభుత్వాల్లో కింది వాటిలో రిజర్వేషన్ వర్తించే పదవి ఏది?
1) వార్డు సభ్యుడు
2) ఉప సర్పంచ్
3) డిప్యూటీ మేయర్
4) జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్
- View Answer
- సమాధానం: 1
7. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో కింది వాటిలో లేనిది?
1) గ్రంథాలయాలు
2) కుటుంబ సంక్షేమం
3) చేపల పెంపకం
4) శాంతి భద్రతలు
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ?
1) నీతి ఆయోగ్
2) రాష్ట్ర ప్రణాళిక బోర్డు
3) జిల్లా ప్రణాళిక సంఘం
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 3
9. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్?
1) 243 (I)
2) 243 (K)
3) 243 (S)
4) 243 (E)
- View Answer
- సమాధానం: 2
10. అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1979లో నియమించిన కమిటీ?
1) ఎం.టి. రాజు కమిటీ
2) సి. నరసింహం కమిటీ
3) బి.పి.ఆర్. విఠల్ కమిటీ
4) జలగం వెంగళరావు కమిటీ
- View Answer
- సమాధానం: 2
11. ఎన్.టి. రామారావు 1986లో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేస్తూ, అప్పుడు అమల్లో ఉన్న ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు?
1) 330
2) 340
3) 360
4) 380
- View Answer
- సమాధానం: 1
12. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
1) 1993 మే 30
2) 1994 మే 30
3) 1993 ఏప్రిల్ 24
4) 1994 ఏప్రిల్ 24
- View Answer
- సమాధానం: 2
13. పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపజేయడానికి పెసా చట్టాన్ని 1996లో ఏ కమిటీ సిఫారసు మేరకు చేశారు?
1) విఠల్ కమిటీ
2) కున్వర్సింగ్ కమిటీ
3) దిలీప్‌సింగ్ భూరియా కమిటీ
4) యు.ఎన్. దేబర్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
14.ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లు ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు?
1) చంద్రబాబు నాయుడు
2) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
3) వైఎస్ రాజశేఖర రెడ్డి
4) కిరణ్‌కుమార్‌రెడ్డి
- View Answer
- సమాధానం: 4
15. తొలితరం గ్రామపంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1959
2) 1964
3) 1977
4) 1984
- View Answer
- సమాధానం: 2
16.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు?
1) రెండోతరం
2) మూడోతరం
3) నాలుగోతరం
4) ఐదోతరం
- View Answer
- సమాధానం: 2
17. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ అంశాలపై వేసిన కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ?
1) పంచాయతీల సహకార సంస్థల అధ్యయనం – ఎస్.డి. మిశ్రా కమిటీ
2) న్యాయ పంచాయతీల అధ్యయనం – జి. రాజగోపాల్ కమిటీ
3) పంచాయతీరాజ్ ఎన్నికల అధ్యయనం – కె. సంతానం కమిటీ
4) పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాలపై – వి.ఆర్. రావు కమిటీ
- View Answer
- సమాధానం: 4
18. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ‘స్థానిక పాలన’ అనేది..?
1) రాష్ట్ర జాబితాలోని ఐదో అంశంగా ఉంది
2) రాష్ట్ర జాబితాలోని ఏడో అంశంగా ఉంది
3) ఉమ్మడి జాబితాలోని ఐదో అంశంగా ఉంది
4) ఉమ్మడి జాబితాలోని ఏడో అంశంగా ఉంది
- View Answer
- సమాధానం: 1
19. మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు 1946లో ప్రారంభించిన ‘ఫిర్కా పథకం’ ప్రధాన ఉద్దేశం?
1) అభివృద్ధి పథకాల అమలు
2) స్థానిక అవసరాలు తీర్చడం
3) తాలూకాలను విభజించి ఫిర్కాల ఏర్పాటు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
20.ప్రస్తుతం రాష్ట్రంలో కిందివారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కానివారు?
1) మేయర్
2) కౌన్సిలర్
3) కార్పొరేటర్
4) వార్డు సభ్యుడు
- View Answer
- సమాధానం: 1
21. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, ప్రస్తుతం ఏ తేదీ తర్వాత ఒక వ్యక్తి మూడో సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హుడు?
1) 1994 మే 30
2) 1995 మే 30
3) 1993 ఏప్రిల్ 24
4) 1994 ఏప్రిల్ 24
- View Answer
- సమాధానం: 2
22. మునిసిపాలిటీల్లో జనాభా ఎంత దాటితేవార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి?
1) ఒక లక్ష
2) రెండు లక్షలు
3) మూడు లక్షలు
4) నాలుగు లక్షలు
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థల అధికారాల్లో ఐచ్ఛిక అంశం ఏది?
1) తాగునీరు
2) పారిశుద్ధ్యం
3) వీధి దీపాలు
4) పార్కుల నిర్మాణం
- View Answer
- సమాధానం: 4
24. స్థానిక సంస్థలకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని జత?
1) వార్డు సభ్యుడు – రూ. 500
2) సర్పంచ్ – రూ. 2000
3) ఎంపీటీసీ – రూ. 3000
4) జెడ్పీటీసీ – రూ. 5000
- View Answer
- సమాధానం: 3
25. ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
1) 2002 జనవరి 1
2) 2003 జనవరి 1
3) 2004 జనవరి 1
4) 2005 జనవరి 1
- View Answer
- సమాధానం: 1
26. కింది వాటిలో గ్రామపంచాయతీ కార్యదర్శి విధి కానిది ఏది?
1) గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ
2) గ్రామపంచాయతీ పన్నుల వసూలు
3) కలెక్టర్ ఆదేశంతో గ్రామపంచాయతీని రద్దు చేయడం
4) గ్రామపంచాయతీ తీర్మానాల అమలు
- View Answer
- సమాధానం: 3
27. స్థానిక సంస్థల్లో ‘రీకాల్’ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?
1) కర్ణాటక
2) పంజాబ్
3) కేరళ
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
28. గ్రామపంచాయతీలో సర్పంచ్ ప్రధాన సలహాదారు?
1) ఉపసర్పంచ్
2) కో–ఆప్షన్ సభ్యుడు
3) పంచాయతీ కార్యదర్శి
4) కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి
- View Answer
- సమాధానం: 3
29. గ్రామపంచాయతీ కార్యదర్శికి ‘చెక్ పవర్’..?
1) ఉండదు
2) ఉంటుంది. కానీ, సర్పంచ్‌తో కలిపి ఉపయోగించాలి
3) ఉంటుంది. స్వతహాగా ఉపయోగించవచ్చు
4) స్వతహాగా ఉండదు. కానీ సర్పంచ్ ఇవ్వొచ్చు
- View Answer
- సమాధానం: 2
30. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెంగళూరు
2) ముంబై
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
31. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) భారతదేశంలో అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ – ముంబై
బి) ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ – విశాఖపట్నం
సి) తెలంగాణలో అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ – హైదరాబాద్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
32. కంటోన్మెంట్ బోర్టు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1924
2) 1935
3) 1947
4) 1950
- View Answer
- సమాధానం: 1
33. మునిసిపాలిటీకి ఉండాల్సిన కనిష్ట, గరిష్ట జనాభా ఎంత?
1) 20,000 3,00,000
2) 40,000 2,00,000
3) 40,000 3,00,000
4) 20,000 2,00,000
- View Answer
- సమాధానం: 3
34. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయిలో ‘అంచాలిక్ వ్యవస్థ’ ఏ రాష్ట్రంలో అమలులో ఉంది?
1) గుజరాత్
2) తమిళనాడు
3) కేరళ
4) అసోం
- View Answer
- సమాధానం: 4
35. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?
1) ప్రవేశపెట్టరాదు
2) సంవత్సరం తర్వాత సగం మంది జిల్లా పరిషత్ సభ్యుల మద్దతుతో ప్రవేశపెట్టవచ్చు
3) జిల్లా పరిషత్ సీఈవో అనుమతితో ఎప్పుడైనా పెట్టవచ్చు
4) నాలుగు సంవత్సరాల పదవీకాలం తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి
- View Answer
- సమాధానం: 4
36. మునిసిపాలిటీలను దేని ప్రాతిపదికపై ఐదు రకాలుగా వర్గీకరించారు?
1) జనాభా
2) వార్షిక ఆదాయం
3) జనాభా, వార్షిక ఆదాయం
4) జనాభా, వార్షిక ఆదాయం, జీవన ప్రమాణం
- View Answer
- సమాధానం: 2
37.సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాగ సవరణ ఎన్నోది?
1) 95
2) 96
3) 97
4) 98
- View Answer
- సమాధానం: 3
38. నగర పాలక సంస్థలకు 18 అంశాలపై అధికారం కల్పించే షెడ్యూల్?
1) 11
2) 12
3) 7
4) 11, 12
- View Answer
- సమాధానం: 2
39. స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్త్యున్నత వ్యవస్థ?
1) పట్టణాభివృద్ధి శాఖ
2) సంక్షేమ శాఖ
3) గ్రామీణాభివృద్ధి శాఖ
4) సిబ్బంది వ్యవహారాల శాఖ
- View Answer
- సమాధానం: 3
40. జిల్లా ప్రణాళిక సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది?
1) 243 ZD
2) 243 ZE
3) 243 ZF
4) 243 ZG
- View Answer
- సమాధానం: 1
41. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పంచాయతీరాజ్ సంస్థలు వాటిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులకు సంబంధించి కింది వాటిలో సరైన జత?
ఎ) తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ – నీలం సంజీవరెడ్డి
బి) మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది – ఎన్.టి. రామారావు
సి) సచివాలయ వ్యవస్థ – చంద్రబాబు నాయుడు
డి) నూతన పంచాయతీరాజ్ వ్యవçస్థ – కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
42. జిల్లా పరిషత్‌లో ఉన్న స్థాయి సంఘాల సంఖ్య?
1) 5
2) 7
3) 9
4) 11
- View Answer
- సమాధానం: 2
43. గిరిజన ప్రాంతాలకు వర్తించే పెసా చట్టం..?
1) గ్రామపంచాయతీ కంటే గ్రామసభకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది
2) గ్రామసభ కంటే గ్రామపంచాయతీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది
3) రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
44. స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి కావల్సిన కనీస వయసు?
1) 18
2) 21
3) 25
4) ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది
- View Answer
- సమాధానం: 2
45. కింది వాటిలో పంచాయతీరాజ్ మౌలిక చట్టంలో లేని అంశాలు?
ఎ) సచివాలయ వ్యవస్థ
బి) మహిళలకు 50% రిజర్వేషన్లు
సి) జిల్లా ప్రణాళిక సంఘం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
46. అనివార్య పరిస్థితుల్లో మండల పరిషత్‌ను ఐదేళ్ల కంటే ముందే రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1) గవర్నర్
2) రాష్ట్ర ప్రభుత్వం
3) కలెక్టర్
4) ఎంపీడీవో
- View Answer
- సమాధానం: 2
47. ఒక గ్రామపంచాయతీలో సర్పంచ్‌తో కలిపి గరిష్ట సభ్యుల సంఖ్య? (జనాభా ప్రకారం)
1) 21
2) 23
3) 25
4) 27
- View Answer
- సమాధానం: 1
48.అశోక్ మెహతా కమిటీని నియమించిన ప్రధానమంత్రి ఎవరు?
1) ఇందిరాగాంధీ
2) మొరార్జీ దేశాయ్
3) చరణ్‌సింగ్
4) రాజీవ్‌గాంధీ
- View Answer
- సమాధానం: 2
49. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, ఒక రాష్ట్ర జనాభా ఎంత కంటే తక్కువ ఉంటే మూడంచెల వ్యవస్థ అవసరం లేదు?
1) 10 లక్షలు
2) 15 లక్షలు
3) 20 లక్షలు
4) 25 లక్షలు
- View Answer
- సమాధానం: 3
50. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తి ఎన్ని రూ.వేలకు మించి ఖర్చు చేయరాదు? (మేజర్, మైనర్ గ్రామపంచాయతీ వరుసగా)
1) రూ. 50,000, రూ. 25,000
2) రూ. 1,00,000, రూ. 50,000
3) రూ. 80,000, రూ. 40,000
4) రూ. 40,000, రూ. 20,000
- View Answer
- సమాధానం: 3
51. ‘గ్రామపంచాయతీ కార్యదర్శి’ పదవి ఏ సంవత్సరంలో అవతరించింది?
1) 2000
2) 2002
3) 2004
4) 2006
- View Answer
- సమాధానం: 2
52. ‘పంచాయతీ కార్యదర్శి’ గతంలో ఉన్న ఏ పదవి స్థానంలో అవతరించింది?
1) వి.డి.ఒ.
2) వి.ఆర్.ఒ.
3) వి.పి.ఒ.
4) వి.ఎ.ఒ.
- View Answer
- సమాధానం: 1
53. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి పదవి ఎన్ని కేటగిరీలుగా ఉంది?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 3