Skip to main content

వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు అధిక భాగం అమలుపరిచిన రాష్ర్టం?

 వ్యవసాయం, ఆహార నిర్వహణఆర్థిక సర్వే 2018-19
 భారతదేశంలో అధిక శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనోపాధి. అధిక శ్రామిక శక్తికి వ్యవసాయ రంగం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మరోవైపు స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటాల్లో తగ్గుదలను గమనించవచ్చు. స్థిర ధరల వద్ద (2011-12) స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 2012-13లో 17.8 శాతం  కాగా 2015-16లో 15.4 శాతం, 2018-19లో ప్రాథమిక అంచనాల ప్రకారం 14.4 శాతానికి తగ్గింది. స్థూల కలుపబడిన విలువలోపంటల వాటా 2012-13లో 11.5 శాతం నుంచి 2017-18లో 8.7 శాతానికి తగ్గింది. జి.వి.ఎ.లో పంటల వాటా తగ్గుదల కారణంగా వ్యవసాయ అనుబంధ రంగాల వాటా జి.వి.ఎ.లో తగ్గింది.
  స్థిర ధరల వద్ద వ్యవసాయ, అనుబంధరంగాల స్థూల కలుపబడిన విలువ(జి.వి.ఎ.) వృద్ధిలో 2012-13వ సంవత్సరంలో తర్వాత ఒడిదుడుకులు అధికమయ్యాయి. 2012-13లో వ్యవసాయ,అనుబంధ రంగాల జి.వి.ఎ.లో వృద్ధి 1.5 శాతం నుంచి 2013-14లో 5.6 శాతానికి పెరిగింది. 2014-15లో రుణాత్మక వృద్ధి నమోదు కాగా 2016-17లో 6.3 శాతం, 2018-19లో 2.9 శాతం వృద్ధి నమోదయ్యింది. పంటల జి.వి.ఎ.లో వృద్ధి 2014-15, 2015-16లో రుణాత్మకంగా నమోదయింది.
  దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలతో పోల్చినపుడు ఆర్థిక సమ్మిళితం తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో తక్కువని క్రిసిల్, 2018 నివేదిక పేర్కొంది. దేశంలోని తూర్పు ప్రాంతం, ఈశాన్య, సెంట్రల్ రీజియన్‌లో సాగులో ఉన్న కమతాలలో చిన్న, ఉపాంత కమతాలు 8.5 శాతం. సకాలంలో పరపతి లభ్యత వ్యవసాయ రంగంలో లాభదాయకతను నిర్ణయిస్తుంది. ప్రాంతాల వారిగా వ్యవసాయ పరపతి పంపిణీని పరిశీలించినపుడు అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఈశాన్య, కొండ, తూర్పు రాష్ట్రాలకు లభించిన వ్యవసాయ పరపతి తక్కువ. 2018-19లో మొత్తం వ్యవసాయ పరపతి పంపిణీలో ఈశాన్య రాష్ట్రాల వాటా ఒక శాతం కన్నా తక్కువగా ఉంది.
  ప్రపంచ ఆహార భద్రత సూచీ 2018 ఆహార భద్రత విషయంలో 113 దేశాలకు సంబంధించి నాలుగు ముఖ్యంశాలను పరిగణనలోకి తీసుకుంది. అవి 1. Affordability, 2. లభ్యత, 3. నాణ్యత, భద్రత 4. సహజ వనరులు, Resilience. ఈ సూచీకి సంబంధించి స్కోరు 0-100 మధ్య ఉంటుంది. వివిధ దేశాల ర్యాంకులను రూపొందించడానికి మొదటి మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. నాలుగో అంశం సహజ వనరులు, Resilience ను సర్దుబాటు  చేసే కారకంగా ఉపయోగిస్తారు. తక్కువ తలసరి స్థూల దేశీయోత్పత్తి, ప్రొటీన్ నాణ్యత, పరిశోధన, అభివృద్ధిపై ప్రభుత్వ వ్యయం లాంటి అంశాలను పరిశీలించినపుడు ఆహార భద్రతకు సంబంధించి భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించవచ్చు. పౌష్టికాహార ప్రమాణాలకు సంబంధించి భారత్ మొదటి ర్యాంకు సాధించగా, మొత్తం భారత  ఆహార భద్రత స్కోరు 50.1. మొత్తం 113 దేశాలకు గాను ఈ సూచీ విషయంలో భారత్ 76వ స్థానం పొందింది. ఆహార సరఫరా యాజమాన్యాన్ని అనేక అంశాల్లో భారత్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.
  రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సంబంధించిన అంశాలను పరిశీలించి, లక్ష్య సాధనకు అవసరమైన వ్యూహాలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆదాయ వృద్ధికి  ఏడు ఆధారాలను కమిటీ గుర్తించింది. అవి.
 1. పంట ఉత్పాదకత పెంపు
 2. పశు సంపద ఉత్పాదకతలో మెరుగుదల
 3. వనరుల వినియోగ సామర్థ్యం, ఉత్పత్తి వ్యయంలో ఆదా
 4. పంట సాంద్రత పెంపు
 5. అధిక విలువ కలిగిన పంటలపై దృష్టి కేంద్రీకరించడం
 6. రైతులకు లభించే వాస్తవిక ధరలలో మెరుగుదల
 7. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర కార్యకలాపాలపై దృష్టి
 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్య సాధనకు కనీస మద్ధతు ధరలను 2018-19 ఖరీఫ్, రబీ పంటలకు ప్రభుత్వం పెంచింది.చిన్న, సన్నకారు రైతుల సాంఘిక భద్రతకుగాను అర్హులైన వారికి నెలకు రూ.3000 వృద్ధ్దాప్య పింఛను ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించింది. చిన్న, సన్నకారు రైతులు 60ఏళ్ల వయస్సుకు చేరినపుడు పింఛను అందించనుంది.
 
మాదిరి ప్రశ్నలు :
Published date : 02 Aug 2019 03:48PM

Photo Stories