విదేశీ వాణిజ్యం
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో కరెంటు ఖాతా లోటు 2011 తర్వాత కాలంలో మెరుగుపడి 2017లో 444.7 బిలియన్ డాలర్లు మిగులు నమోదైంది. ఇదే కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కరెంటు ఖాతాలో లోటు పెరిగింది. ఈ స్థితి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో వినియోగ స్థాయిలో పెరుగుదలను స్పష్టపరుస్తుంది. భారత్ కరెంటు ఖాతా లోటు 2016-17లో జీడీపీలో 0.6 శాతం కాగా 2017-18లో 1.8 శాతానికి పెరిగింది. 2018-19లో కరెంటు ఖాతా లోటు భారత్‌లో 2.4 శాతంగా ఉండగలదని అంచనా. వస్తు వాణిజ్య లోటు పెరుగుదల అధికంగా ఉండటం భారత్ కరెంటు ఖాతా లోటు పెరుగుదలకు కారణమైంది. 2018-19 సంవత్సరం మొదటి అర్థ భాగంలో క్రూడ్ చమురు ధరల పెరుగుదల కారణంగా భారత్‌లో చెల్లింపుల శేషం స్థితి కొంత మేర ఒత్తిడికి గురైంది. 2018-19 సంవత్సరం మూడో త్రైమాసికంలో అంతర్జాతీయ చమురు ధరలలో తగ్గుదల సంభవించింది. కరెంటు ఖాతా లోటు అధికంగా ఉన్న ముఖ్య ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిర్వహి స్త్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిర్వహిస్తున్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానం పొందింది.
2018-19లో భారత్ మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా 2018-19లో 14.1 శాతం. వివిధ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి సంబంధించి ఆర్గానిక్ రసాయనాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. భారత్ మొత్తం దిగుమతుల విలువలో పెట్రోలియం, క్రూడ్ వాటా 22.2 శాతం కాగా బంగారం, ఇతర విలువైన మెటల్ జ్యూయలరీ వాటా 6.4 శాతంగా నమోదైంది. భారత్‌కు సంబంధించి ఎగుమతి కేంద్రంగా అమెరికా నిలిచింది. 2018-19లో భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 16 శాతం కాగా తర్వాత స్థానాల్లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, హాంకాంగ్‌లు నిలిచాయి. 2018-19లో భారత్ ఎగుమతుల వృద్ధి వివిధ దేశాల పరంగా పరిశీలించినప్పుడు నెదర్లాండ్స ప్రథమ స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో చైనా, నేపాల్‌లు నిలిచాయి. భారత్ దిగుమతుల విషయంలో చైనాపై అధికంగా ఆధారపడగా తర్వాత స్థానాల్లో అమెరికా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు నిలిచాయి.
ప్రపంచ వ్యాప్తంగా అనేక ముఖ్య ప్రాంతీయ గ్రూపులతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధ ఒప్పందాలు చేసుకుంది. సార్క దేశాలలో భారత్, బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో పాటు ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలని భావిస్తుంది. ్కట్ఛజ్ఛట్ఛ్టజ్చీ వాణజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, ఇరాన్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు మినహా అన్ని విధాలైన ఉత్పత్తుల విషయంలో ‘డ్యూటీ-రహిత’ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శ్రీలంకతో జరిగింది. నూతన ఆర్థిక సాంకేతిక సహకార ఒప్పందాన్ని శ్రీలంకతో చేసుకోవాలని భారత్ చర్చలు జరుపుతుంది.
మాదిరి ప్రశ్నలు :
ఎ) భారత్ మాల యోజన
బి) సాగర మాల యోజన
సి) అంత్యోదయ అన్నా యోజన
డి) ఇందిరా ఆవాస్ యోజన
1) ఎ మాత్ర మే
2) ఎ, బి
3) సి మాత్రమే
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 2
2. 2018-19లో భారత్ దిగుమతులలో కింది ఏ దేశానికి సంబంధించి వృద్ధి అధికంగా నమోదైంది?
1) సింగపూర్
2) హాంకాంగ్
3) చైనా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
3. ప్రపంచ ఉత్పత్తి వృద్ధిని ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్’ 2019లో ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 2.6 శాతం
2) 3.1 శాతం
3) 3.3 శాతం
4) 5.2 శాతం
- View Answer
- సమాధానం: 3
4. ప్రపంచ బ్యాంక్ అభిప్రాయంలో 2018లో ప్రపంచంలో అధిక ట్ఛఝజ్ట్ట్చీఛ్ఛిట పొందిన దేశాలు వరుస క్రమంలో...
ఎ) భారత్
బి) చైనా
సి) మెక్సికో
డి) ఫిలిప్పిన్స
1) ఎ, సి, డి
2) బి, సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
5. 2019 జూన్ 14 నాటికి భారత్ విదేశీ మారక నిల్వలు ఎంత?
1) 372.2 బిలియన్ డాలర్లు
2) 422.2 బిలియన్ డాలర్లు
3) 472.2 బిలియన్ డాలర్లు
4) 487.5 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
6. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా, బ్రెజిల్ తర్వాత కింది ఏ దేశం అధిక రుణగ్రస్త దేశంగా నిలిచినట్లు ప్రపంచ బ్యాంక్ గణాంకాలు తెల్పుతున్నాయి?
1) భారత్
2) దక్షిణ కొరియా
3) ఇండోనేషియా
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
7. 2018-19లో భారత్ ఎగుమతుల్లో కింది ఏ ఉత్పత్తుల వాటా అధికం?
1) ఇనుము, ఉక్కు
2) మోటారు వాహనాలు
3) పెట్రోలియం ఉత్పత్తులు
4) ఆర్గానిక్ రసాయనాలు
- View Answer
- సమాధానం: 3
8. 2018-19లో భారత్ ఎగుమతులకు సంబంధించి కింది ఏ ఉత్పత్తి ఎగుమతిలో వృద్ధి అధికంగా న మోదైంది?
1) ఆర్గానిక్ రసాయనాలు
2) ముత్యాలు, విలువైన రాళ్లు
3) మోటారు వాహనాలు
4) ఇనుము, ఉక్కు ఉత్పత్తులు
- View Answer
- సమాధానం: 1
9. 2018-19లో భారత్ ఎగుమతులకు సంబంధించి అధిక వృద్ధి కింది ఏ దేశంలో నమోదైంది?
1) చైనా
2) సింగపూర్
3) నెదర్లాండ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 3
10. కరెంటు ఖాతా లోటును 2018-19లో జి.డి.పి.లో ఎంత శాతం ప్రతిపాదించారు?
1) 2.1 శాతం
2) 2.4 శాతం
3) 3.2 శాతం
4) 3.6 శాతం
- View Answer
- సమాధానం: 2
11. ప్రపంచంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అధికంగా నిర్వహిస్తున్న దేశాల్లో భారత్ స్థానం?
1) 2
2) 3
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 4
12. అమెరికా, చైనా తర్వాత భారత్‌కు సంబంధించి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి?
1) హాంకాంగ్
2) సింగపూర్
3) శ్రీలంక
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
13. 2018 డిసెంబర్ నాటికి భారత్ విదేశీ రుణం?
1) 489.5 బిలియన్ డాలర్లు
2) 521.1 బిలియన్ డాలర్లు
3) 571.1 బిలియన్ డాలర్లు
4) 591.7 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
14. ప్రపంచ వాణిజ్య సంస్థ అభిప్రాయంలో 2017తో పోల్చినపుడు 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ధిలో క్షీణతకు కారణం?
1) చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు
2) ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం
3) విత్త మార్కెట్లలో ఒడిదుడుకులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15. 2018-19లో భారత్ ఎన్ని ద్వైపాక్షిక / బహుళ వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది?
1) 25
2) 27
3) 28
4) 32
- View Answer
- సమాధానం: 3
16. ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ ప్రగతి సూచీ, 2018లో భారత్ సాధించిన ర్యాంక్?
1) 37
2) 44
3) 52
4) 62
- View Answer
- సమాధానం: 2
17.భారత్ 2018-19లో అధికంగా కింది ఏ దేశం నుంచి దిగుమతులు చేసుకుంది?
1) చైనా
2) అమెరికా
3) హాంకాంగ్
4) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
- View Answer
- సమాధానం: 1
18. సార్క దేశాల్లో కింది ఏ దేశంతో ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ భావిస్తుంది?
1) శ్రీలంక
2) పాకిస్తాన్
3) బంగ్లాదేశ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 3
19. గత ఐదు సంవత్సరాల కాలంలో భారత లాజిస్టిక్ రంగ సగటు సాంవత్సరిక వృద్ధి?
1) 7.5 శాతం
2) 7.8 శాతం
3) 8.1 శాతం
4) 9.5 శాతం
- View Answer
- సమాధానం: 2
20. దేశాల మధ్య ‘కరెన్సీవార్’ను ఏ విధంగా వ్యవహరించవచ్చు?
1) ఆయా దేశాల కరెన్సీ మూల్యహీనీకరణ
2) అధిక బంగారం నిల్వను నిర్వహించడం
3) అధిక డాలర్ రిజర్వులను నిర్వహించడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:1
21. కింది ఏ సార్క దేశంతో నూతన ఆర్థిక సాంకేతిక సహకార ఒప్పందం కోసం భారత్ చర్చలు జరుపుతుంది?
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) శ్రీలంక
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
22. అస్థిర వినిమయరేటు విధానంలో కరెంటు ఖాతా లోటును తగ్గించడానికి ఉపకరించేది?
1) ద్రవ్య సప్లయ్ పెంపు
2) స్వదేశీ కరెన్సీ విలువలో క్షీణత
3) స్వదేశీ కరెన్సీ విలువలో పెరుగుదల
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
23. భారత కరెన్సీ మూల్యహీనీకరణ కింది ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1949
బి) 1966
సి) 1991
డి) 1997
1) ఎ
2) ఎ, డి
3) సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
24. భారత కరెన్సీ మూల్యహీనీకరణ కింది ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1949
బి) 1966
సి) 1991
డి) 1997
1) ఎ
2) ఎ, డి
3) సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
25. నికర విదేశీ పోర్టఫోలియో పెట్టుబడుల్లో ఒడిదుడుకులు అధికంగా ఏ సంవత్సరంలో నమోదయ్యాయి?
1) 2011-12
2) 2012-13
3) 2013-14
4) 2018-19
- View Answer
- సమాధానం: 3
26. భారత్‌లో లాజిస్టిక్ రంగం ఏ సంవత్సరానికి అధిక ఉపాధికల్పన రంగంగా రూపొందుతుందని నిపుణుల అభిప్రాయం?
1) 2021
2) 2022
3) 2027
4) 2030
- View Answer
- సమాధానం: 2
27. తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
1) రికార్డో
2) శామ్యుల్సన్
3) ఆడమ్ స్మిత్
4) టోబిన్
- View Answer
- సమాధానం: 1
28. దిగుమతి సుంకం ప్రభావం కింది వాటిలో ఏ విధంగా ఉంటుంది?
1) వాణిజ్య పరిమాణం తగ్గుతుంది
2) వాణిజ్య పరిమాణం పెరుగుతుంది
3) వాణిజ్య పరిమాణంపై ఏ ప్రభావం ఉండదు
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
29. భారత్ సేవల ఎగుమతుల వాణిజ్యంలో వృద్ధి ఏ సంవత్సరంలో అధికంగా నమోదైంది?
1) 2008-09
2) 2009-10
3) 2010-11
4) 2018-19
- View Answer
- సమాధానం: 3
30. MERCOSUR లో సభ్యత్వం లేని దేశం?
1) వెనిజులా
2) బ్రెజిల్
3) అర్జెంటీనా
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 4
31.ఇటీవలి కాలంలో బంగారం ధర పెరుగుదలకు కారణం?
ఎ) భారత్‌లో బంగారానికి డిమాండ్ పెరుగుదల
బి) అమెరికాలో వడ్డీరేట్ల తగ్గుదల
సి) అమెరికా డాలర్‌కు సంబంధించి రూపాయి విలువలో క్షీణత
డి) కేంద్ర బ్యాంక్‌ల బంగారం కొనుగోలు పెరుగుదల
1) ఎ
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
32. ఏడో ఆర్థిక గణాంకాల సేకరణ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1) సిక్కిం
2) త్రిపుర
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
33. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2019ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) కోల్కత్తా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
34. ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత్ వృద్ధిని 2019-20లో ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7.2 శాతం
2) 7.3 శాతం
3) 7.6 శాతం
4) 7.7 శాతం
- View Answer
- సమాధానం: 3
35. వ్యవసాయ ఎగుమతి విధానం 2018 లక్ష్యం ఏమిటి?
ఎ) ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించడం
బి) రాబోయే 5 ఏళ్ల కాలంలో వ్యవసాయ ఎగుమతుల విలువ 100 బిలియన్ డాలర్లకు పెంచడం
సి) ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్ వాటా రెట్టింపు
డి) విదేశీ మార్కెట్లో ఎగుమతుల అవకాశాలను పెంపొందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడం
1) ఎ
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
36. మొదటి ఇండియా-ఆసియాన్ ఐౌ ఖ్ఛీఛిజి సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
37. బిహార్ స్టేట్ హైవేస్ ఐఐఐ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కింది ఏ సంస్థతో ఇటీవల రుణ ఒప్పందం చేసుకుంది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంక్
2) ప్రపంచ బ్యాంక్
3) ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్
4) ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం:1