Skip to main content

పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అధిక భారితం(weight) కలిగినది?

పరిశ్రమలు, అవస్థాపన  ఆర్థిక సర్వే 2018-19 
 
పారిశ్రామిక రంగ వృద్ధి 2017-18లో 4.4 శాతం కాగా 2018-19లో 3.6 శాతానికి తగ్గింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పరపతి ప్రవాహం తగ్గుదల, ద్రవ్యత్వం కొరత కారణంగా  నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అందించే రుణంలో తగ్గుదల, ఆటోమొబైల్ రంగం,  ఫార్మాస్యూటికల్, యంత్రాలు, పరికరాలు లాంటి కీలక రంగాల ఉత్పత్తులకు సంబంధించి స్వదేశీ డిమాండ్ తగ్గుదల తో పాటు అంతర్జాతీయ ముడిచమురు ధరల్లో అనిశ్చితిలాంటి అంశాలు 2018-19లో పారిశ్రామిక రంగ వృద్ధి తగ్గుదలకు దారితీశాయి. ఎనిమిది కీలక అవస్థాపనా పరిశ్రమల్లో వృద్ధి 2018-19లో 4.3 శాతంగా నమోదైంది. ఆయా పరిశ్రమల్లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి అధికం కాగా తర్వాత స్థానంలో బొగ్గు నిలిచింది. ముడిచమురు ఉత్పత్తిలో వృద్ధి రుణాత్మకం కాగా, ఎరువుల ఉత్పత్తిలో 0.3 శాతం. సహజ వాయువు ఉత్పత్తిలో 0.8 శాతంగా నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఎనిమిది కీలక అవస్థాపనా పరిశ్రమల భారితం(weight) 40.3 శాతం. పారిశ్రామిక రంగ స్థూల మూలధన కల్పనలో వృద్ధి 2016-17లో రుణాత్మకం కాగా 2017-18లో 7.6 శాతంగా నమోదైంది. స్థూల మూలధన కల్పనలో వృద్ధి అధికంగా నిర్మాణ రంగంలో నమోదు కాగా, తర్వాత స్థానంలో తయారీ రంగం నిలిచింది.

  రిజర్వుబ్యాంకు అంచనాల ప్రకారం పారిశ్రామిక రంగానికి సంబంధించి స్థూల బ్యాంక్ పరపతిలో వృద్ధి 2017-18లో 0.7 శాతం కాగా, 2018-19లో 6.9 శాతానికి పెరిగింది. రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, సిమెంటు, సిమెంటు ఉత్పత్తులు, ఇంజినీరింగ్ పరిశ్రమలు, నిర్మాణ రంగం, అవస్థాపనా పరిశ్రమలకు సంబంధించి 2018-19లో పరపతి వృద్ధిలో పెరుగుదల నమోదు కాగా, టెక్స్‌టైల్స్, పెట్రోలియం, బొగ్గు ఉత్పత్తులు, న్యూక్లియర్ ఇంధనం, మెటల్ ఉత్పత్తులకు సంబంధించి పరపతి వృద్ధిలో క్షీణత ఏర్పడింది.

  ఆర్థిక వృద్ధి, ఉపాదికల్పన, నవ కల్పనలకు స్టార్టప్‌లు దోహదపడుతున్నాయి. యువతలోనవకల్పనను ప్రోత్సహించడానికి  2015 ఆగస్టు 15న ప్రధాన మంత్రి ‘స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా’ను ప్రకటించారు. దేశంలోని 499 జిల్లాల్లో మార్చి 1, 2019 నాటికి 16,578 నూతన స్టార్టప్‌లను గుర్తించారు. ఇవి అధికంగా మహారాష్ర్టలో ఏర్పాటు కాగా, తర్వాత స్థానంలో కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణలు నిలిచాయి. దేశంలో మొత్తం గుర్తించిన స్టార్టప్‌ల్లో మహరాష్ర్ట వాటా 18.91 శాతం కాగా, తెలంగాణ వాటా 5.59 శాతం. పరిశ్రమల వారీగా స్టార్టప్‌లను పరిశీలించినపుడు ఐటీ సర్వీసుల్లో నిమగ్నమైన స్టార్టప్‌లు ఎక్కువ. తర్వాత స్థానాల్లో హెల్త్ కేర్, లైఫ్ సెన్సైస్, విద్య, వృత్తి, వాణిజ్య సేవల్లో నిమగ్నమైన స్టార్టప్‌లు ఎక్కువ.

  భారత్ ఎగుమతుల వృద్ధికి వజ్రాలు, ఆభరణాల రంగం తోడ్పాటు అధికంగా ఉంది. ఈ రంగం 5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. 2017-18లో దేశంలోని మొత్తం వస్తు ఎగుమతుల్లో ఈ రంగం వాటా 13.69 శాతం. స్పెషల్ నోటిఫైడ్ జోన్‌‌స ఏర్పాటు, కామన్ ఫెసిలిటీ కేంద్రాల ఏర్పాటు, కట్, polished diamonds కు వస్తు సేవల పన్ను తగ్గింపు, ఎంపిక చేసిన ఏజెన్సీలు, బ్యాంకులు దిగుమతి చేసుకునే బంగారంపై ఐజీఎస్టీ మినహాయింపు లాంటి ప్రోత్సాహకాలను ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించింది. స్వదేశీ తయారును పటిష్టం చేయడంతో పాటు చిన్న తరహా ఆధారిత స్వదేశీ ఆభరణాల పరిశ్రమను ప్రోత్సహించడానికి  2019 జనవరిలో ‘డొమెస్టిక్ కౌన్సిల్ ఫర్ జెమ్స్ అండ్ జ్యూయలరీ‘ని ప్రారంభించింది. అవస్థాపన రంగంపై భారత్ సంవత్సరానికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండగా ఈ మొత్తం 100-110 బిలియన్ డాలర్లకే పరిమితమవుతుంది.
 
మాదిరి ప్రశ్నలు:
Published date : 10 Aug 2019 12:28PM

Photo Stories