Skip to main content

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించే నిమిత్తం ‘గ్రీన్ కార్ లోన్’ను మొదటగా ప్రవేశపెట్టిన ప్రభుత్వరంగ బ్యాంక్?

స్వయం సహాయక బృందాలు - బ్యాంక్ అనుసంధాన కార్యక్రమం
స్థూలంగా సుస్థిర, సంతులిత, సమ్మిళిత వృద్ధ్ది సాధన, కుటుంబ, సంస్థల స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన వారిలో ఆర్థిక, సాంఘిక సమ్మిళితం సాధన క్రమంలో ఆర్థిక సమ్మిళితం (financial inclusion) అనే భావన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆర్థిక సమ్మిళితం, ఆర్థిక స్థిరత్వం అనేవి ఆర్థిక వ్యూహంలో ముఖ్యాంశాలు. అనేక ఫైనాన్షియల్ సర్వీసుల అందుబాటు విషయంలో ఆర్థిక సమ్మిళితం సప్లయ్‌ైవైపు కారకంగా పనిచేస్తుంది. బ్యాంక్‌లు, ఇతర సంస్థలు అందించే ఫైనాన్షియల్ సేవల పట్ల కలిగే ప్రయోజనం విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ను డిమాండ్‌వైపు కారకంగా పనిచేస్తుంది. ఆర్థిక సమ్మిళితం సాధనకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపారస్థులు, బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, సూక్ష్మ సంస్థలకు ప్రయోజనాన్ని కల్పించే విషయంలో ఆయా కార్యక్రమాలు దోహదపడ్డాయి.
భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సమ్మిళితం సాధనకు నాబార్డ్ కృషి చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంక్‌లు, ఎన్‌జీఓస్‌తో సంప్రదింపుల అనంతరం నాబార్డ్ 1991-92లో ‘స్వయం సహాయక బృందాలు - బ్యాంక్ అనుసంధాన’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 1992 ఫిబ్రవరిలో 255 స్వయం సహాయక బృందాలను బ్యాంక్‌లతో అనుసంధానం చేశారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లకు ఈ కార్యక్రమాన్ని 1993లో విస్తరించారు. మార్చి 2018 నాటికి 173.99 లక్షల స్వయం సహాయక బృందాలను బ్యాంక్‌లతో అనుసంధానం చేశారు. నాబార్డ్ యొక్క స్వయం సహాయక బృందాలు - బ్యాంక్ అనుసంధాన కార్యక్రమం కింద 2007-08లో 12.28లక్షల స్వయం సహాయక బృందాలు ఆర్థిక సహాయం పొందగా వీటి సంఖ్య 2017-18లో 22.61 లక్షలకు పెరిగింది. మొత్తంగా మార్చి 2018 నాటికి 173.99 లక్షల స్వయం సహాయక బృందాలు నాబార్డ్ బ్యాంక్ అనుసంధాన కార్యక్రమం కింద ఆర్థిక సహాయం పొందాయి.
స్వయం సహాయక బృందాలకు అందించిన బ్యాంక్ రుణం 1992-93లో రూ.0.29 కోట్లు కాగా ఈ మొత్తం 2017-18 నాటికి రూ.75,598 కోట్లకు చేరింది. బ్యాంక్‌లకు నాబార్డ్ రీఫైనాన్సింగ్ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాలకు బ్యాంకింగ్ రంగం అందించే రుణం పెరిగింది. నాబార్డ్ బ్యాంక్‌లకు ఇచ్చే రీఫైనాన్స్ 1992-93లో రూ.0.27 కోట్లుకాగా 2017-18 నాటికి ఈ మొత్తం రూ.47,185 కోట్లకు పెరిగింది.
స్వయం సహాయక బృందాలు-బ్యాంక్ అనుసంధాన కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాల భౌతిక ప్రగతిలో ప్రాంతీయ అసమానతలను గమనించవచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు దక్షిణ ప్రాంతం స్వయం సహాయక బృందాల వాటా ఎక్కువ. 1999-2000లో ఈ కార్యక్రమం కింద కవర్ చేసిన మొత్తం స్వయం సహాయక బృందాల్లో దక్షిణ ప్రాంతం వాటా 68.59 శాతం కాగా 2017-18 నాటికి 41.73 శాతానికి తగ్గింది. కానీ ఈ కాలంలో ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు దక్షిణ ప్రాంతం వాటానే ఎక్కువ. ఇదే కాలంలో పశ్చిమ ప్రాంతం వాటా 8.19 శాతం నుంచి 24.37 శాతానికి పెరిగింది. Central region వాటా 13.29 శాతం నుంచి 10.32 శాతానికి తగ్గగా ఉత్తర ప్రాంతం వాటా 2.81 శాతం నుంచి 5.48 శాతానికి పెరిగింది. ఈ కాలంలో ఉత్తర ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాంక్ అనుసంధాన కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాల వాటాలో ప్రగతి నెమ్మదిగా ఉండటాన్ని గమనించవచ్చు. Central region మినహా దేశంలో మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ ఈ కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాల వాటాలో పెరుగుదల ఏర్పడింది.
స్వయం సహాయక బృందాల ప్రాంతాల వారీగా సగటు పొదుపు విషయంలోనూ దక్షిణ ప్రాంతం ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా సగటు పొదుపు బ్యాలెన్స్ 2002-03లో రూ.2346 కాగా 2017-18లో రూ.22,405గా నమోదైంది. ఇదే కాలంలో దక్షిణ ప్రాంతంలోని స్వయం సహాయక బృందాల సగటు పొదుపు బ్యాలెన్స్ రూ.4074 నుంచి రూ.33,317కు పెరిగింది.
ప్రతి స్వయం సహాయక బృందానికి అందించిన సగటు రుణ మంజూరులోనూ దక్షిణ ప్రాంతం ముందంజలో ఉంది. 2002-03లో ప్రతి (ఞ్ఛట ఏఎ) సహాయక బృందానికి మంజూరు చేసిన సగటు రుణం దేశంలో రూ.39953 నుంచి 2017-18లో రూ.2,08,683కు పెరిగింది. ఇదే కాలంలో దక్షిణ ప్రాంతంలో సగటు రుణ మంజూరు రూ.53,410 నుంచి రూ.2,79,454కు పెరిగింది.

మాదిరి ప్రశ్నలు

Published date : 17 May 2019 06:03PM

Photo Stories