జీవావరణ శాస్త్రం
1. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు?
1) ఎకోటైప్
2) ఎకోటోన్
3) సిన్టైప్
4) ఇకార్డ్
- View Answer
- సమాధానం: 2
2. ‘ఆవరణ వ్యవస్థ’ (Eco-system) అనే పదాన్ని ప్రతిపాదించినవారు?
1) ఎ.జి. టాన్స్ లే
2) ఇ.పి. ఓడం
3) ఎర్నెస్ట్ హెకెల్
4) క్లెమెంట్స్
- View Answer
- సమాధానం: 1
3. ఆవరణ శాస్త్రాన్ని ‘జీవ సమాజాల విజ్ఞానం’గా నిర్వచించింది ఎవరు?
1) క్లెమెంట్స్
2) క్రెబ్స్
3) హెకెల్
4) ఓడం
- View Answer
- సమాధానం: 1
4. ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు?
1) జనాభా (Population)
2) జీవ మండలం (Biome)
3) జీవ సమాజం (Community)
4) జీవ గోళం (Biosphere)
- View Answer
- సమాధానం: 3
5. కింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైంది ఏది?
1) ఆకురాల్చే అడవి
2) వర్షాధార అడవి
3) గడ్డి నేల
4) టండ్రా
- View Answer
- సమాధానం: 4
6. 2015 గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంత?
1) 523
2) 411
3) 336
4) 742
- View Answer
- సమాధానం: 1
7. దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
8. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) ఆక్సైలోఫైట్స్
2) సియోఫైట్స్
3) సాయోఫైట్స్
4) ఎరిమోఫైట్స్
- View Answer
- సమాధానం: 2
9. కిందివాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది?
1) సహారా ఎడారి
2) అరేబియా ఎడారి
3) థార్ ఎడారి
4) గోబి ఎడారి
- View Answer
- సమాధానం: 4
10. గడ్డి-ఆకుమిడత-కప్ప-సర్పం-డేగ అనే ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి లభ్యత కలిగిన జీవి ఏది?
1) కప్ప
2) డేగ
3) సర్పం
4) ఆకుమిడత
- View Answer
- సమాధానం: 2
11. ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు?
1) లెంటిక్
2) నెరిటిక్
3) లోటిక్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
12. నీటి అడుగున జీవించేవాటిని ఏవిధంగా వ్యవహరిస్తారు?
1) నెక్టాన్స్
2) న్యూస్టాన్స్
3) బెంథాస్ (Benthos)
4) పెలాజిక్
- View Answer
- సమాధానం: 3
13. 2014 గణాంకాల ప్రకారం భారత్లో పులుల సంఖ్య?
1) 1411
2) 1706
3) 2226
4) 3211
- View Answer
- సమాధానం: 3
14. ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదా నిర్వహించే క్రియాశీల పాత్రను ఏమంటారు?
1) ఇకలాజికల్ నిషే
2) ఎకోటోన్
3) ఎకోలైప్
4) సింటైప్
- View Answer
- సమాధానం: 1
15. ఆటెకాలజీ అండ్ సినెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగాలను ప్రవేశపెట్టినవారు?
1) ఓడం
2) హెకెల్
3) ఎల్టన్ అండ్ క్లెమెంట్స్
4) క్రిక్నర్ అండ్ ష్క్రోటర్
- View Answer
- సమాధానం: 4
16. ‘ఎకోలజీ’ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?
1) లాటిన్
2) గ్రీకు
3) ఫ్రెంచ్
4) ఇటాలియన్
- View Answer
- సమాధానం: 2
17. నీటిలో వేగంగా తేలియాడే జీవులను ఏమంటారు?
1) న్యూస్టాన్స్
2) బెంథాస్
3) నెక్టాన్స్
4) పెలాజిక్
- View Answer
- సమాధానం: 3
18. ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాల చెవులు, తోక లాంటి అవయవాల పరిమాణం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది?
1) బెర్జమాన్ సూత్రం
2) గ్లాగర్స్ సూత్రం
3) ఆలెన్స్ సూత్రం
4) జోర్డాన్ సూత్రం
- View Answer
- సమాధానం: 3
19. ఉష్ణమండల ప్రాంతాల్లోని జంతువుల శరీర వర్ణం, సమశీతోష్ణ మండల జంతువుల శరీర వర్ణంతో పోలిస్తే గాఢంగా ఉంటుందని వివరించే సూత్రం?
1) జోర్డాన్ సూత్రం
2) గ్లాగర్స్ సూత్రం
3) బెర్జమాన్ సూత్రం
4) ఆలెన్స్ సూత్రం
- View Answer
- సమాధానం: 2
20. కింది వాటిలో అస్థిరోష్ణ జీవి ఏది?
1) చేప
2) బల్లి
3) కప్ప
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది?
1) జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావం
2) శరీర వర్ణంపై కాంతి ప్రభావం
3) శరీర కదలికలపై కాంతి ప్రభావం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
22. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు వినియోగించేది?
1) అతినీలలోహిత కిరణాలు
2) దృగ్గోచర కాంతి
3) పరారుణ కిరణాలు
4) సూక్ష్మ తరంగాలు
- View Answer
- సమాధానం:2
23. కింది వాటిలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించే జీవ మండలం ఏది?
1) వర్షాధార అడవి
2) పచ్చిక మైదానం
3) టండ్రా
4) ఆల్ఫైన్
- View Answer
- సమాధానం: 1
24.ఆటెకాలజీ అనే జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ?
1) పశ్చిమ కనుమల్లో ఆవాసాల క్షీణత
2) దేశంలో తగ్గుతున్న బట్టమేక పక్షుల సంఖ్య
3) వ్యవసాయంపై శీతోష్ణస్థితి మార్పు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
25. కింది వాటిలో ఎకోటోన్కు ఉదాహరణ?
1) సముద్రం
2) నది
3) నదీ ముఖ ద్వారం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
26. దేశంలో ప్రవాళ అవరోధాలు (Coral Reefs) లేని ప్రాంతం?
1) కచ్
2) సుందర్బన్స్
3) లక్షదీవులు
4) గల్ఫ్ ఆఫ్ మన్నార్
- View Answer
- సమాధానం: 2
27. ఏ ప్రోటీను ఆక్సీకరణం ద్వారా మిణుగురు పురుగు జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది?
1) లైకోపీన్
2) ల్యూసిఫెరిన్
3) ల్యూసిఫెరేజ్
4) ల్యూటీన్
- View Answer
- సమాధానం: 2
28. ‘కోల్డ్ డిజర్ట్’ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జమ్ము-కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
29. ఏ దేశంలో ‘మావోరీ’ అనే ప్రత్యేక తెగకు చెందిన ప్రజలు కనిపిస్తారు?
1) ఆస్ట్రేలియా
2) బ్రెజిల్
3) న్యూజిలాండ్
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 3
30. కింది వాటిలో అవసారన వలయం (Sedimentary cycle) ఏది?
1) కార్బన్ వలయం
2) భాస్వరం వలయం
3) నత్రజని వలయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:2
31. ఆహార పిరమిడ్ లేదా జీవావరణ పిరమిడ్ భావనను ప్రతిపాదించినవారు?
1) చార్లెస్ ఎల్టన్
2) ఎర్నెస్ట్ హెకెల్
3) ఓడం
4) క్లెమెంట్స్
- View Answer
- సమాధానం: 1
32. కింద ఇచ్చిన ఏ ఆహార శృంఖలాన్ని ‘మేసే ఆహార గొలుసు’ అంటారు?
1) వృక్ష ఫ్లవకం - జంతు ఫ్లవకం - చిన్న చేప - పెద్ద చేప
2) రాలి కుళ్లుతున్న ఆకులు - శిలీంధ్రాలు - మ్యాగ్గాట్స్ - కప్ప
3) పంట పొలం - పచ్చ సెనగ పురుగు - బ్యాక్యులో వైరస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
33. ఏ రకమైన పదార్థంలో కలుషితమైన నీరు తాగడం ద్వారా మెథనో హీమోగ్లోబినిమియా అనే రక్తహీనత వస్తుంది?
1) పాదరసం
2) సీసం
3) ఫాస్ఫేట్లు
4) నైట్రేట్లు
- View Answer
- సమాధానం: 4
34. విచ్ఛిన్నకారులను ఏమంటారు?
1) వియోగదారులు
2) డెట్రివోర్స్
3) డీకంపోజర్స్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో ఎలాంటి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది?
1) సంఖ్యా పిరమిడ్
2) శక్తి పిరమిడ్
3) జీవరాశి పిరమిడ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
36. జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభించేవి?
1) గడ్డి మొక్కలు
2) లెకైన్స్
3) గుబురు మొక్కలు
4) వృక్షాలు
- View Answer
- సమాధానం:2
37. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని ఏమంటారు?
1) బెంథిక్ మండలం
2) అబిసల్ మండలం
3) హ్యాడల్ మండలం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిలో వినియోగదారి జీవి?
1) స్పైరోగైరా
2) వాల్వాక్స్
3) టైఫ
4) సైక్లాప్స్
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిలో విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తున్న జీవులేవి?
1) పుపుస చేపలు
2) ఎగరని పక్షులు
3) మార్సూపియల్స్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
40. చర్మం ద్వారా నీటిని పీల్చుకునే ఏ బల్లి ప్రత్యేకంగా థార్ ఎడారిలో కనిపిస్తుంది?
1) డైపొడొమిస్
2) మొలక్
3) ప్రోటోప్టెరస్
4) లెపిడోసైరిన్
- View Answer
- సమాధానం: 2
41. ఏ జీవులు తమ రక్తంలో యూరియాను నిల్వ చేసుకుంటాయి?
1) అస్థి చేపలు
2) మృదులాస్థి చేపలు
3) కీటకాలు
4) బల్లులు
- View Answer
- సమాధానం: 2
42. రాత్రి వేళల్లో ఒంటె శరీర ఉష్ణోగ్రత ఎంత వరకు తగ్గుతుంది?
1) 40°C
2) 28° C
3) 34° C
4) 10° C
- View Answer
- సమాధానం: 3
43. సముద్రం నుంచి నదికి, ఆ తర్వాత తిరిగి సముద్రానికి వలస వెళ్లే చేపలను ఏమంటారు?
1) అనాడ్రోమస్
2) కెటాడ్రోమస్
3) ఆంఫీడ్రోమస్
4) పొటమోడ్రోమస్
- View Answer
- సమాధానం: 1
44. జీవ సందీప్తిని ప్రదర్శించే జీవి?
1) మిణుగురు పురుగు
2) పెలాలో పురుగు
3) పైరోసోమ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
45. బొరియల్లో నివసించే జీవులను ఏమంటారు?
1) ఆర్బోరియల్
2) కర్సోరియల్
3) ఫజోరియల్
4) వోల్యాంట్
- View Answer
- సమాధానం: 3
46. భూమిపై అధికంగా ఏ రకమైన వృక్షజాలం ఉంది?
1) శైవలాలు
2) వివృత బీజాలు
3) ఆవృత బీజాలు
4) బ్రయోఫైట్స్
- View Answer
- సమాధానం: 1
47. శక్తి ప్రసరణను వివరించే 10 శాతం సూత్రాన్ని ప్రతిపాదించింది?
1) లిండమన్
2) చార్లెస్ ఎల్టన్
3) క్లెమెంట్స్
4) గ్లాగర్
- View Answer
- సమాధానం:1
48.స్వాదు జల జీవావరణ వ్యవస్థల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) లిమ్నాలజీ
2) కార్సినాలజీ
3) కాలాలజీ
4) మైకాలజీ
- View Answer
- సమాధానం: 1
49.చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ఏది?
1) రామ్సార్ ఒప్పందం
2) బాన్ ఒప్పందం
3) బేసిల్ ఒప్పందం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
50.నోక్రెక్ బయోస్పియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం
2) సిక్కిం
3) మిజోరాం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం:4
51. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది?
1) ఆహార శృంఖలం
2) ఇకలాజికల్ నిషే
3) ఎకోటోన్
4) ఎకోటైప్
- View Answer
- సమాధానం: 1
-
52. కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) గొరిల్లా
2) చింపాంజీ
3) లంగూర్
4) గిబ్బన్
-
- సమాధానం: 3
53. కింద పేర్కొన్న వాటిలో ‘తినడం, తినబడటం’ అనే సూత్రం ఏది?
1) ఆవరణ వ్యవస్థ
2) ఇకలాజికల్ నిషే
3) ఆహార శృంఖలం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
54. కింది వాటిలో లెంటిక్ జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ?
1) చెరువు
2) కొలను
3) సరస్సు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
55. ప్రవాళ అవరోధాలు ఎక్కడ కనిపించవు?
1) అరేబియా సముద్రం
2) హిందూ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) అంటార్కిటిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 4
56.కింది వాటిలో శీతోష్ణస్థితిని నిర్ధారించే పర్యావరణ కారకం ఏది?
1) ఉపరితల ఉష్ణోగ్రతలు
2) సౌరపుటం
3) వర్షపాతం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
57. భూమిపై ఉన్న మొత్తం నీటిలో స్వాదు జలం శాతం ఎంత?
1) 5
2) 4.3
3) 3.6
4) 2.1
- View Answer
- సమాధానం: 4
58. నీటి లవణీయతలో భారీ హెచ్చుతగ్గులను తట్టుకోగలిగే జీవులను ఏమంటారు?
1) యూరిథర్మల్
2) యూరీహాలైన్
3) స్టీనో థర్మల్
4) స్టీనో హాలైన్
- View Answer
- సమాధానం: 2
59. ఆవరణ వ్యవస్థలో ప్రధాన పరభక్షక జీవి ఏది?
1) ధ్రువ ఎలుగుబంటి
2) సింహం
3) సొరచేప
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
60. జీవావరణ అనుక్రమంలో మధ్యంతర దశలను ఏమంటారు?
1) పయనీర్
2) క్లైమాక్స్
3) సీరల్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
61. తెలంగాణలో టైగర్ రిజర్వలు ఎన్ని ఉన్నాయి?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 2
-
62. కింది వాటిలో ఉభయలింగ జీవి ఏది?
1) స్పంజిక
2) బద్దెపురుగు
3) వానపాము
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4