Group 1 Notification: వచ్చే వారంలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ ? భర్తీ ప్రక్రియ ఇలా..
ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది.
Groups Guidance: మొదటిసారిగా గ్రూప్ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
ఇప్పటివరకు..
ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్‌పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్‌పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 18వ తేదీన(సోమవారం) సైతం టీఎస్‌పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది.
ఈ ఏడాది (2022) తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..:
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!
టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్ –1 పోస్టులు ఇలా..
➤జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
➤అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40
➤అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38
➤ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20
➤ డీఎస్పీ– 91
➤ జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2
➤ బఅసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8
➤డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్–2
➤జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6
➤మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35)
➤ఎంపీడీవో(121)
➤డీపీవో(5)
➤కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48)
➤డిప్యూటీ కలెక్టర్(42)
➤అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26)
➤జిల్లా రిజిస్ట్రార్(5)
➤జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3)
➤ఆర్టీవో(4)
➤ జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2)
మొత్తం: 503
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..