Skip to main content

Any Time Group-2, 3 Notification In TS: ఎనీటైం గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌

తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ జాతర మొదలైంది. వివిధ విభాగాల్లో పేరుకుపోయిన ఖాళీల వివరాలను బయటకు తీసి మరీ భర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Group 2, 3

ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 ఉద్యోగాల భర్తీకి  చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. డిసెంబర్‌ 10న మరో 7వేలకు పైగా పోస్టులకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్‌1, పోలీస్, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు విడదలైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌...
పోలీస్, గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. పోలీస్‌ అభ్యర్థులకు ఈవెంట్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు.. జేఎల్, పీఎల్, డ్రగ్స్‌ ఇన్స్‌స్పెక్టర్, గ్రూప్‌ 4 వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు అందరి చూపు గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 మీద పడింది. ఈ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు వచ్చాయి. ఏ క్షణమైనా వీటికి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.   
663 నుంచి 726కు పెరిగిన పోస్టులు
గ్రూప్‌ 2లో భాగంగా 726 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో గ్రూప్‌–2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజాగా ఆ సంఖ్య 726కు చేరింది. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ 3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌ 2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (కో ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) ఉన్నాయి.  వీటితో పాటు..  అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్‌ సబ్ ఇన్‌స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (పీఆర్‌), అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండోమెంట్‌), అసిస్టెంట్‌ సెక్షన్ ఆఫీసర్‌ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్‌, లా) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 
గ్రూప్‌ 2కు మరో 6 రకాల పోస్టుల యాడ్‌....
ప్రస్తుతం గ్రూప్‌ 2 కేటగిరీలో 16 రకాల పోస్టులుండగా.. వీటికి మరో 6 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. అసిస్టెంట్‌ సెక్షన్‌  ఆఫీసర్‌ (తెలంగాణ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌  సర్విస్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, డ్రిస్టిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ (జువైనల్‌ కరెక్షనల్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (బీసీ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ఎస్సీడీడీ సబ్‌ సర్వీస్‌) ఉద్యోగాలు ఇకపై గ్రూప్‌2 సర్వీసుల్లోకి వస్తాయి. అలాగే గ్రూప్‌ 3కి సంబంధించి 1373 పోస్టులకు ఏ క్షణమైనా నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. 
ఇంటర్వ్యూను తీసేసిన ప్రభుత్వం
గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్‌ 2 పరీక్షను 600 మార్కులకు కుదించారు. ఇంటర్వ్యూకు 75 మార్కులను తీసేశారు. ఈ సారి 600 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌ 3 పరీక్ష మొత్తం 450 మార్కులకు ఉండనుంది.

Published date : 13 Dec 2022 05:29PM

Photo Stories