Skip to main content

Government Jobs: పోటీపరీక్షల్లో ప‌ట్టు చిక్కాలంటే.. ఈ మెలకువలు పాటించాల్సిందే..!

చాలా కాలం నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
best preparation tips for competitive exams
Preparation Tips For Competitive Exams

అలాగే భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ  ఖాళీలను భర్తీ చేస్తామని ప్ర‌కటించిన విష‌యం తెల్సిందే. ఇందులో భాగంగా ముందుగా 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా గ్రూప్‌-1, 2 పోస్టుల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానున్న‌ది. ఈ నేప‌థ్యంలో కొలువు కొట్టాలంటే ముందు ప‌ట్టు చిక్కాలి. ఈ ప‌ట్టు చిక్కాలంటే.. ఈ మెళ‌కువ‌లు పాటించాల్సిందే..

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

ప్రభుత్వ ఉద్యోగం మీ కలనా..? నెరవేర్చుకోవడం ఎలా..?
డీగ్రీ అయిపోయిన విద్యార్థులంతా తాను గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. కానీ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అది అంత సాధ్యం కాదు. సరైనా ప్రణాళిక, అంకితభావం ఉంటే అది సుసాధ్యం అవుతుంది. అయితే చాలా మంది ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు చదువుతున్నప్పటికీ వారికి ఫలితం సున్నా. అయితే ఈ క్రింద 7 సుత్రాలను పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం మీదే అని చెబుతున్నారు నిపుణులు. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్‌స్సీ పోటీ పరీక్షలకు సిద్దమవడానికి మీరు పాటించాల్సిన ఈ 7 సూత్రాలు మీ కోసం..

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ పరీక్షలలో విజయం సాధించడం ఎలా?

Best Plan


1. మీరు ఏం చదువుకున్నారని కాదు, డిగ్రీ పాస్ అయితే చాలు. మీరు చేయాల్సిందల్లా మొదటగా ఏ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారో మీకు మీరు ఓ స్పష్టత తెచ్చుకోవాలి. నేను ఏ ఉద్యోగానికి వెళ్తున్నాను? నోటిఫికేషన్ ఏ విధంగా పడింది? ఉద్యోగం పేరేంటి? ఇలా పూర్తిగా స్పష్టతతో ఉండాలి. 

2. దానికి సంబందించిన సిలబస్‌ను పూర్తిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ సిలబస్‌పై పట్టు సాదించాలి.

3. ఆ సిలబస్‌కు తగ్గట్టుగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. 

4. త‌ర్వాత దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా ప్రముఖ కోచింగ్‌ సెంటర్ల గురించి తెలుసుకోవాలి. ఎటువంటి కోచింగ్‌ తీసుకోవాలి అనే దాని గురించి మొదట స్పష్టమైన అవగాహన ఉండాలి.

5. వీటన్నింటితో పాటు సిలబస్‌ గురించిన సమాచారాన్ని మైక్రోషీట్‌లో రెడీచేసుకోవాలి. మనకు ఎన్ని సబ్జెక్ట్స్‌ ఉన్నాయన్నది తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా అందులోని సిలబస్ ఏంటి? అనే దానిపై మైక్రోషీట్‌ రెడీ చేసుకోవాలి. ఈ మైక్రోషీట్‌తో నెల రోజు టైం టెబుల్‌ను సిద్దం చేసుకోండి. మీరు చదివే పోటీ పరీక్షలో ఉన్న సబ్జెక్స్‌ ఏంటో, ఎన్ని ఉన్నాయో వాటన్నింటిని మైక్రోషీట్‌లో రాసుకుంటే సిలబస్‌ను తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఈ‌ ప్రకారం 1వ తేదీ ఎన్నిపాఠాలు చదవాలి? అనేది నిర్ణయించుకోవాలి. ఉదాహారణకు 1వ తేదీన హిస్టరీలో రెండు పాఠాలు, ఎకనామిక్స్‌లో రెండు పాఠాలు ఇలా రాసుకుని ఆ రోజు ఎన్ని పాఠాలు పూర్తి చెయ్యాలో షీట్‌పై వేసుకునే టైంటేబుల్‌నే మైక్రోషీట్ అని పిలుస్తాం.
    అయితే సబ్జెక్టుపై మాత్రమే పట్టు సాధించినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మార్కులు సాధించలేము. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్‌లోను పట్టు సాధించాలి. దీని కోసం ఎక్కువ రోజులు కెటాయించకుండా కేవలం 10 రోజుల్లో సబ్జెక్ట్స్‌ కవర్‌ అయ్యేలా మీ మైక్రోషీట్‌ను తయారు చేసుకోండి. మొత్తం 10 రోజులలో సబ్జెక్ట్స్ అన్ని పూర్తిగా చదవాలి. దీనిని ఫాస్ట్‌ రౌండ్‌ అని పిలుస్తాం. మరల 11 వ రోజు నుంచి 20వ రోజు వరకు దానిపై సెకండ్‌ రౌండ్‌ మొదలు పెట్టాలి. ఇలా నెలకు మూడు రౌండ్లు పూర్తవుతాయి. ఇలా 50 రోజులలో 5 రౌండ్లు చదవాలి. అప్పడే సిలబస్‌ మీద పట్టు వస్తుంది. 

6. ఆన్‌లైన్‌లో మోడల్‌ పేపర్స్ ల‌భ్యమౌవుతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పేపర్లను మీరు ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కవ పేపర్లు ప్రాక్టీస్‌ చేయ్యడం ద్వారా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

7. చివరి భాగం విజయమే. కాంపిటేటివ్‌ పరీక్షలలో ఈ ఏడూ సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇలా పాటించి అతి తక్కువ సమయంలోనే అంటే 50 రోజులల్లోనే మీరు ఈ ప్రణాళికను పట్టుదలతో చేస్తే  తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే కొంత కాంపీటేటివ్‌కు ఎన్ని గంటలు చదవాలని కొంతమంది అడుగుతుంటారు. మీకు సబ్జేక్ట్‌పై పట్టులేకుండా ఎన్ని గంటలు చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి అనేది ముఖ్యం కాదు. చదివిన కొద్ది పేపు సబ్జెక్ట్‌పై పట్టు వచ్చేలా చదవాలి. కాబట్టి పై సుత్రాలను పాటిస్టూ నిబద్ధతతో చదివితే మీరు కోరుకున్న ప్రభుత్వం మీ సొంతం అవుతుంది. 

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

ఇక త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌ నోటిఫికేషన్స్ రానున్నాయి. అంతేగాక ఇదే సిలబస్‌ కూడా ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పరీక్షలకైనా మీరు పాటించాల్సిన సిద్దాంతాలు మాత్రమే ఇవే. పై 7 సూత్రాలను పాటిస్తూ చదివితే కాంపీటేటివ్‌లో తప్పకుండా విజయం సాధిస్తారు. చదువు అనేది ఎవరిసొత్తు కాదు, అది పేదవాడైన, ధనవంతుడైన ఒకేలాగా చదవాలి. కష్టపడితే తప్పకుండ విజయం వస్తుంది. విజయం సాదించాలి అంటే మొదట మనకు కావాల్సింది ఏంటంటే హార్డ్‌వర్క్‌. ఎవరూ కష్టపడుతారో వాళ్లదే తప్పని సరిగా విజయం అవుతుంది.

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..:
గ్రూప్‌-1 పోస్టులు:  503

గ్రూప్‌-2 పోస్టులు : 582

గ్రూప్‌-3 పోస్టులు: 1,373

గ్రూప్‌-4 పోస్టులు : 9,168  

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

ఈ ఏడాది (2022) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2 ఉద్యోగాలు ఇవే..:
గ్రూప్‌–1 పోస్టులు : 110
గ్రూప్‌–2 పోస్టులు : 182

ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 07 Apr 2022 06:56PM

Photo Stories