T.Harish Rao : త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 9,168 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది..
టీఎస్‌పీఎస్సీ 9,168 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఈ ఆదివారం (నవంబర్ 13) ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీగా ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 17 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఆ శాఖలో మరో 2 వేల పోస్టులను కూడా భర్తీ చేస్తాం. వీటిల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి హరీష్ అన్నారు.
చదవండి: Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
మంత్రి చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ శిబిర తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్ధిపేట, గజ్వేల్ లో ప్రిలిమినరీ-రాత పరీక్షకు 1030 మందికి శిక్షణ అందించారు. ఈ శిబిరంలో శిక్షణ పొంది 580 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆసక్తి ఉన్న వారికి రెండవ దశలో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
సిద్దిపేటజిల్లాలోని.. దుబ్బాక, గజ్వేల్, చేర్యాల పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యిందనీ, ఇక ఫిజికల్ దేహ దారుఢ్య పరీక్ష మిగిలిందనీ, మీరంతా పట్టుదలతో ఉద్యోగం కోసం సాధన చేయాలన్నారు. అప్పుడే ప్రజాప్రతినిధులుగా మాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చిన వారవుతారనీ మంత్రి అభ్యర్థులకు వివరించారు.
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేరకే ఉద్యోగాల భర్తీ
అత్యధికం ఉన్న గ్రూప్-4 పోస్టులు ఇవే..
తెలంగాణలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్–4 ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్–4 కేటగిరీలో అత్యధికం జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్ సర్వీస్ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరించింది.
ఈ నిబంధనలు ఆధారంగానే..
రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇది వరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనలు ఆధారం కానున్నాయి.
గ్రూప్–4 సిలబస్ ఇదే..
పేపర్-1 (మార్కులు 150) :
➤ జనరల్ నాలెడ్జ్
➤ వర్తమాన వ్యవహారాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం
➤ పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
➤ భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు
➤ భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
➤ భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
➤ జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
➤ తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
➤ తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
పేపర్ -2 (మార్కులు 150) :
☛ పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
☛ మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)
☛ లాజికల్ రీజనింగ్
☛ కాంప్రహెన్షన్
☛ రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్
☛ న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్