Skip to main content

TSPSC Group 4 Application : నేటి నుంచే 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు అప్లికేషన్స్‌ ప్రారంభం.. ఈ ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-4 ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి ప్రారంభ‌మైంది.
TSPSC Group 4 Applications
TSPSC Group 4 Applications Details

షెడ్యుల్ ప్ర‌కారం అయితే.. డిసెంబ‌ర్ 23వ తేదీ జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల్సింది ఉంది. అయితే కొన్ని టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల కార‌ణంతో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను వారం రోజులు పాటు వాయిదా వేసిన విష‌యం తెల్సిందే. అయితే ఈ గ్రూప్‌-4 ద‌రఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 19వ తేదీ సాయంత్రం 5:00గంట‌ల వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. అలాగే పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in/ ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు. ఇలా అయితే గ్రూప్ 4  రాత‌పరీక్షను మే లేదా జూన్ లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో..
జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ ఆడిటర్, వార్డ్‌ ఆఫీసర్‌ హోదాల్లో.. 9,168 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నది. గ్రూప్‌-1,2,3 సర్వీసులకు పోటీ పడే ప్రతి ఒక్కరూ గ్రూప్‌-4కు కూడా హాజరవుతారని చెబుతున్నారు. గ‌తంలో 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్‌ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. అలాగే పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్‌-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో దాదాపు 10 ల‌క్ష‌ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పోస్టులు ఇవే..
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ I&CADలో జూనియర్ స్టెనో
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో టైపిస్ట్
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో జూనియర్ స్టెనో
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్
☛ I&CADలో జూనియర్ అసిస్టెంట్
☛రెవెన్యూ శాఖలో టైపిస్టు
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో టైపిస్ట్
☛ గ్రామ రెవెన్యూ అధికారి (VRO)
☛గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)
☛ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో జేఏ
☛ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్.

గ్రూప్‌-4 ప‌రీక్షావిధానం ఇదే..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4ను రెండు పేపర్లుగా.. 300 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.  ఇందులో పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, అలాగే పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 30 Dec 2022 01:44PM

Photo Stories