Hitech Copying in Group 4 Exam 2023 : గ్రూప్-4 రాతపరీక్షలో హైటెక్ కాపీయింగ్.. పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థి.. ఎలా అంటే..?
ఈ రాత పరీక్షను ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించారు. ఉదయం జరిగిని ఈ రాతపరీక్షలో ఓ అభ్యర్థి హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. సెల్‌ఫోన్‌ను వెంట తెచ్చుకుని దాని సాయంతో ఎగ్జామ్ రాసేందుకు యత్నించి పట్టుబడ్డాడు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్తో హాజరైనట్లు గమనించిన ఇన్విజిలేటర్, అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఈ గ్రూప్-4 రాతపరీక్షకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులకు పైగా హాజరయ్యే అవకాశం ఉంది. 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ రాతపరీక్షను నిర్వహించనున్నది.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేపర్-1 కొశ్చన్‌పేపర్-2023 కోసం క్లిక్ చేయండి