Skip to main content

గ్రూప్‌-4 ఎగ్జామ్‌: అభ్యర్థి కొంపముంచిన గూగుల్‌ మ్యాప్‌... ప‌రీక్ష మిస్ అయిన యాదాద్రి యువ‌కుడు

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థి కొంపముంచిన గూగుల్‌ మ్యాప్‌... ప‌రీక్ష మిస్ అయిన యాదాద్రి యువ‌కుడు
అభ్యర్థి కొంపముంచిన గూగుల్‌ మ్యాప్‌... ప‌రీక్ష మిస్ అయిన యాదాద్రి యువ‌కుడు

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1(జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 జరుగుతుంది. పరీక్షకు 15 నిమిషాల ముందే నిర్వాహకులు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు.

TSPSC Group 4: గ్రూప్ 4లోనూ బ‌లగం సినిమాపై ప్ర‌శ్న‌...వైర‌ల్ అవుతున్న ప్ర‌శ్న‌ప‌త్రం

balagam

ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్‌ మ్యాప్‌ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్‌ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్‌లో సెంటర్‌ పడింది. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కృష్ణవేణి స్కూల్‌ లొకేషన్‌ సెట్‌ చేసుకోగా.. అది పాత స్కూల్‌ అడ్రస్‌ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్‌ రాసేందుకు అనుమతించలేదు. 

గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌లో హైటెక్ కాపీయింగ్.. ప‌రీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థి.. ఎలా అంటే..?

tspsc

ఈ ఘ‌ట‌న‌తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో పలువురు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఐదుగురు అభ్యర్థులు, నాచారంలో నలుగురు, బాలానగర్‌లో ఇద్దరు అభ్యర్థుల.. ఇలా చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా రావడంతో పోలీసులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో చేసేది లేక వారంతా వెనుదిరిగారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పేప‌ర్‌-1 కొశ్చ‌న్‌పేప‌ర్-2023 కోసం క్లిక్ చేయండి

Published date : 01 Jul 2023 04:00PM

Photo Stories