Skip to main content

APPSC Group 1 Ranker Mahendra Success : డిగ్రీ నుంచే చ‌దివానిలా.. గ్రూప్‌-1 కొట్టానిలా..

ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి.. ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది.
మహేంద్ర, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్
మహేంద్ర, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్

2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన మహేంద్ర స‌క్సెస్ స్టోరీ మీకోసం..

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

కుటుంబ నేప‌థ్యం :
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ సాకే చిన్నికృష్ణ, సాకే నారాయణమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర.

☛ Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

ఎడ్యుకేష‌న్ :
ఈయన పదో తరగతి వరకు ధర్మవరంలోని జీవానంద స్కూల్‌లో చదివారు. ఇంటర్‌ విజయవాడ శ్రీ చైతన్య కాలేజీ, డిగ్రీ హైదరాబాద్‌లోని ఉస్మానియా కాలేజీలో పూర్తి చేశారు. 

డిగ్రీ నుంచే..
ఉస్మానియా కాలేజీలో చ‌దివే టైమ్‌ నుంచే గ్రూప్స్‌కు సిద్ధమవుతూ 2018 గ్రూప్‌–1 పరీక్ష రాసి విజయం సాధించారు. 2018 గ్రూపు–1 ఫలితాలలో డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు మహేంద్ర. ఈ ఉద్యోగం సాధించ‌డం ప‌ట్ల ఈత‌ని త‌ల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?

1,14,473 మంది అభ్యర్థులు..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

☛ Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ‌ ర్యాంక్ కొట్టానిలా..

 

Published date : 20 Jul 2022 04:56PM

Photo Stories