APPSC Group-1 Ranker Success Story : ఈ కసితోనే.. గ్రూప్-1 రాశా.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కొట్టా..
2018 గ్రూప్–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన గంధి వెంటటేశ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
APPSC Group-1 Ranker Success Story: ఆన్‌లైన్‌లో చదివి గ్రూప్-1 కొట్టానిలా.. కోచింగ్ లేకుండానే..
ప్రభుత్వ పాఠశాలలోనే చదివా.. అయితేనేం..
గంధి వెంటటేశ్ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. అయితేనేం ఇప్పుడు ఏకంగా గ్రూప్–1కి ఎంపికయ్యారు. తన ప్రతిభతో భళా అనిపించుకున్నారు. కోరుకొండకు చెందిన గ్రంధి సత్యనారాయన మూర్తి కుమారుడు వెంకటేష్.
APPSC Group-1 Ranker Success Story: మా మామకు ఇచ్చిన మాట కోసమే.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..
ఈయన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గుమ్ముటూరు ప్రాథమిక పాఠశాలలోనే చదివారు. కోరుకొండ హైస్కూల్ టెన్త్ వరకూ చదివారు. రాజమహేంద్రవరంలోని ఆదిత్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. 2019లో గైట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?
ఈ కసితోనే.. గ్రూప్-1 రాశా..
తరువాత ప్రైవేట్ ఉద్యోగాలు చేశారు. 2015 ఎఫ్‌సీఐలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఉన్నత స్థానానికి వెళ్లాలనే కసితోనే ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1 పరీక్షలకు ప్రిపేరయ్యానని వెంకటేష్ తెలిపారు. తాజాగా విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
గ్రూప్–1 ఫలితాలు వెల్లడయిన తర్వాత కోరుకొండలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రోడ్డులోని ఈయన నివాసం బంధువులు, ఫెండ్స్‌తో సందడి నెలకొంది. ఆయన సతీమణి.., ఇద్దరు పిల్లలు కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. వెంకటేష్ తండ్రి వ్యవసాయం చేస్తూనే.. చిన్న కిరణా కొట్టు నిర్వహిస్తున్నారు.
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..