APPSC Group-1 Ranker Story : సివిల్స్‌కు కోచింగ్ తీసుకుంటూ.. గ్రూపు–1 కొట్టానిలా.. నా లక్ష్యం ఇదే..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో ఫలితాల్లో ఐదో ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన శ్రీలేఖ సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
శ్రీసత్యసాయి జిల్లా పుట్లూరు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన పోలూరు శ్రీలేఖ.. గ్రూప్–1లో అత్యంత ప్రతిభ చూపి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈమె తండ్రి రంగయ్య నాయుడు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తారు. తల్లి రాజ సులోచన. వీరికి ఇద్దరు ఒక కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
ఎడ్యుకేషన్ :
శ్రీలేఖ 6 నుంచి 10వ తరగతి వరకు తాడిపత్రి సాయివిజేత పాఠశాలలో చదివారు. విజయవాడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
సివిల్స్‌కు కోచింగ్ తీసుకుంటూ..
ఢిల్లీలో ఏడాది పాటు సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2018 సంవత్సరంలో గ్రూపు–1 పరీక్ష రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకుతో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు.
TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు
నా లక్ష్యం ఇదే..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే గ్రూప్–1లో విజయం సాధించానని, తన తదుపరి లక్ష్యం ఐఏఎస్ అని శ్రీలేఖ అన్నారు.
మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే.. కానీ
ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు. అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.
Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..