Skip to main content

APPSC Group 1 Prelims & Mains Exam Pattern Changes 2023: పరీక్షవిధానంలో మార్పులు- చేర్పులు ఇవేనా..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌విధానంలో భారీగా మార్పులు చేసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఏపీపీఎస్సీ బోర్డ్ స‌భ్యులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్ప‌టికే ఏపీపీఎస్సీ బోర్డ్ స‌భ్యుల స‌మావేశం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.
APPSC Group 1 Prelims and Mains Exam Pattern Changes 2023 Telugu News
APPSC Group 1 Prelims and Mains Exam Pattern Changes 2023 Details in Telugu

విశ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. గ‌తంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రెండు పేప‌ర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే పేప‌ర్.. 150 మార్కులు ఉండే అవ‌కాశం ఉంది. అలాగే ఇక‌పై గ్రూప్‌-1 మెయిన్స్‌ Descriptive and Objective విధానంలో ప‌రీక్ష‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ కొత్త‌ ప‌రీక్ష విధానం ఇలా.. ?
గ‌తంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రెండు పేప‌ర్లు ఉండేవి. ఒక్కొక్క పేప‌ర్ 120 మార్కులకు.. మొత్తం 240 మార్కులు ప్రిలిమ్స్ ఉండేది. కానీ ఇప్పుడు కేవ‌లం ఒకే పేప‌ర్ 150 మార్కుల‌కు ఉండే విధంగా ఏపీపీఎస్సీ బోర్డ్ స‌భ్యులు ప్ర‌ణాళిక‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

చదవండి: ఏపీపీఎస్సీ Group 1& 2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ స‌రికొత్త‌గా ఇలా.. ?
☛ అలాగే ఇక‌పై గ్రూప్‌-1 మెయిన్స్‌ Descriptive and Objective విధానంలో ప‌రీక్ష‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ సారి ఒక పేప‌ర్ పూర్తిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారంతో (AP Economy and Devlopments, AP Geography, AP History & Culture) ఉండే అవ‌కాశం ఉంది.
☛ విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే సబ్జెక్టులలో డిస్క్రిప్టివ్ మోడ్ లో పరీక్ష నిర్వహించే అవకాశం... మిగిలిన సబ్జెక్టులలో పరీక్షలు ఆబ్జెక్టివ్ మోడ్ లో నిర్వహించే అవకాశం ఉంది.

ఈ సారి పేప‌ర్ల మూల్యాంకన ప్ర‌క్రియ ఇలా.. :
గ్రూప్‌-1 మెయిన్స్ స‌మాధాన ప‌త్రాల‌ను సంబంధిత స‌బ్జెక్ట్‌లో ప్రావీణ్యం ఉన్న నిపుణుల‌తోనే పేప‌ర్ మూల్యాంకనం చేయ‌నున్నారు.ఇక‌పై మూల్యాంకన ప్రక్రియ మరింత కఠినంగా మారుతుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌విధానంలో మార్పులు.., చేర్పుల‌పై త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Also read: APPSC Group 2 Notification 2023 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

APPSC Group 2 New Syllabus 2023 Details : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్ అంటే..?

Published date : 19 Sep 2023 10:36AM

Photo Stories