Skip to main content

Issues with OTR Process: గ్రూప్‌-1 అప్లై చేశారా? OTR నమోదులో ఇబ్బందులను సరిచేసిన TSPSC

Group-1 Application Process Issues    Issues with OTR Process In TSPSC   Telangana Public Service Commission Group-1 Notification

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కాగా, ఫిబ్రవ్రరి 23 నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యింది. మార్చి 14వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియలో  అభ్యర్థులు కొత్త వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

OTRతో ఇబ్బందులు..వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే
గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా కొత్తగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రూప్-1 పోస్ట్‌లకు OTR నమోదును తప్పనిసరి చేసింది. దీంతో చాలా మంది అభ్యర్థులు డేట్‌ ఆఫ్‌ బర్త్‌(DOB) నమోదు చేసేటప్పుడు ఎంపిక డిసేబుల్‌గా కనిపించడంతో, OTR రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయలేకపోతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే TSPSC హెల్ప్ డెస్క్‌ని సంప్రదించగా, ఈరోజు (ఫిబ్రవరి 29)న సాయంత్రం 4 గంటలలోపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. చెప్పినట్టుగానే TSPSC ఇబ్బందులను సరి చేసింది 

గ్రూప్‌-1 ముఖ్యమైన తేదీలివే:

నోటిఫికేషన్‌ విడుదల: ఫిబ్రవరి 19,2024.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఫిబ్రవరి 23, 2024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు:మార్చి 03,2024.
దరఖాస్తుల సవరణకు అవకాశం : మార్చి 23 నుంచి మార్చి 27,2024.
హాల్ టికెట్లు డౌన్లోడ్ : పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.

ప్రిలిమినరీ పరీక్ష : మే/జూన్ 2024.
మెయిన్స్ పరీక్షలు : సెప్టెంబర్/ అక్టోబరు 2024.
గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను క్లిక్‌ చేయండి. 

Published date : 29 Feb 2024 06:36PM

Photo Stories