Skip to main content

TSPSC: గ్రూప్‌–1 ప్రిలిమినరీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సాక్షి, సిటీబ్యూరో: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ అన్నారు.
Strict arrangements for exam conduct  Hyderabad District Additional Collector Patil Hemanta Keshav  arrangements for Group I Preliminary  Group-1 preliminary examination arrangements

జూన్‌ 9న నిర్వహించనున్న పరీక్ష ఏర్పాట్ల పై రీజినల్‌ కోఆర్డినేటర్లు, జాయింట్‌ కస్టోడియన్స్‌, పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్స్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులతో మే 31న‌సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ జిల్లాలో 40,569 మంది అభ్యర్థులు పరీక్షకు హజరు కానున్నారని, ఇందు కోసం 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

చదవండి: Artificial Intelligence: ఈ రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశంగా ‘కృత్రిమ మేధస్సు’!

పరీక్షా కేంద్రంలోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని కూడా అనుమతించ వద్దన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జాయింట్‌ కస్టోడియన్లు,రీజినల్‌ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Published date : 01 Jun 2024 05:19PM

Photo Stories