Skip to main content

APPSC Group 1 Prelims Paper-2 Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 'కీ' .. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : గ్రూప్‌–1 ఉద్యోగ‌ నియామకాలను ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించ‌నున్నారు. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది.
APPSC Group 1 Prelims Paper 2 Key News
APPSC Group 1 Prelims Paper 2 Key Details

జ‌న‌వ‌రి 8, 2023 (ఆదివారం) జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించున్నారు. పేపర్‌–1 ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, పేపర్‌2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఈ నేప‌థ్యంలో.. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. APPSC Group 1 Prelims  Paper 2 Key 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

☛ APPSC Group 1 Prelims Paper-1 Key 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 'కీ' .. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో..

ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష..

appsc group 1 paper 2 key

మెయిన్స్‌ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయ‌నున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించ‌నున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయనున్నారు.

APPSC Group 1 Prelims Instructions : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

Published date : 07 Jan 2023 07:44PM

Photo Stories