Skip to main content

APPSC Group 1 Prelims Results 2023 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు ఎంత‌మంది వ‌చ్చారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ఫలితాలను జ‌న‌వ‌రి 27వ తేదీన (శుక్ర‌వారం) విడుదల చేసింది.
APPSC Group 1 Prelims
APPSC Group 1 Prelims Results 2023

జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే. ప్రిలిమ్స్ పరీక్షలకు 87,718 మంది (82.38 శాతం) హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. దాంతో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫలితంగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించినట్లయ్యింది. ఏప్రిల్‌ 23వ తేదీన గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో పేపర్‌–1లో ఒక ప్రశ్నను, పేపర్‌–2లో ఇంకో ప్రశ్నను ఏపీపీఎస్సీ తొలగించింది. దీంతో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా తప్పుగా ఉన్న రెండు ప్రశ్నలను ఏపీపీఎస్సీ తొలగించేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికైన వారు వీరే..

Published date : 27 Jan 2023 10:42PM
PDF

Photo Stories