APPSC Group 1 Prelims Paper-1 Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్-1 'కీ' .. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. జనవరి 8, 2023 (ఆదివారం) జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించున్నారు. పేపర్–1 ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, పేపర్2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఈ నేపథ్యంలో.. ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్-1 పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు.
APPSC Group 1 Prelims Paper 1 Key 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష.. ఆగస్టు నాటికి..
మెయిన్స్ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించనున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయనున్నారు.