సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీకి Andhra Pradesh Public Service Commission (APPSC) జారీ చేసిన నోటిఫికేషన్ (28/2022)లో పోస్టుల సంఖ్య 111కి పెరిగింది.
గ్రూప్–1లో అదనంగా మరో కొన్ని పోస్టులు
2018లో జారీచేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌లోని 167 పోస్టుల్లో 19 జాయిన్ అవ్వకపోవడం, భర్తీ కాకపోవడంతో మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ 19 పోస్టులను ప్రస్తుత గ్రూప్–1 నోటిఫికేషన్‌కు జత చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ జనవరి 6న ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ పోస్టులకు సంబంధించి కొన్ని అంశాలు న్యాయస్థానం విచారణలో ఉన్నందున కోర్టు తుది తీర్పునకు లోబడి వీటిని భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. కాగా, 19 పోస్టుల్లో 17 ఎంపికైన అభ్యర్థులు జాయిన్ కాకపోవడంతో మిగిలినవి. అలాగే మరో రెండు భర్తీ కాకుండా ఉన్నవి.