APPSC OMR Sheet Instructions : గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఓఎమ్మార్ సమాధాన పత్రంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,26,449 మంది హాజరవుతారన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్2ను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించున్నారు.పేపర్–1 ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, పేపర్2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓఎమ్మార్ సమాధాన పత్రంలో పాటించాల్సిన జాగ్రత్తలు కింది విధంగా ఉన్నాయి.
ఓఎమ్మార్ సమాధాన పత్రంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
☛ అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం రెండు కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థి పైన ఉండే ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు అందించాలి. దిగువన ఉండే డూప్లికేట్ సమాధాన పత్రాన్ని తన రికార్డుకోసం తీసుకువెళ్లాలి.
☛ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను ఎంపిక చేయరాదు. కేవలం ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇచ్చిన స్థలంలో నీలం లేదా నలుపు బాల్‌పెన్నుతో బబుల్ చేయాలి. వైటనర్, మార్కర్, ఎరేజర్లను వినియోగించినా ఆ సమాధాన పత్రం చెల్లదు.
☛ అంధత్వం, రెండు చేతులకూ వైకల్యం, మస్తిష్క పక్షవాతం గల అభ్యర్థులకు స్క్రయిబర్లను అనుమతిస్తారు. ఈసారి అత్యధికంగా 714 మంది స్క్రయిబర్లు కావాలని దరఖాస్తు చేశారు. అభ్యర్థులు స్క్రయిబ్‌ను తామే తెచ్చుకుంటే వారికి ఆ పోస్టుకు నిర్ణయించిన అర్హత కన్నా తక్కువ అర్హత ఉండాలి. అభ్యర్థి తెచ్చుకున్న స్క్రయిబ్ అర్హుడు కాకుంటే చీఫ్ సూపరింటెండెంటు వేరొకరిని ఏర్పాటు చేస్తారు.
☛ విధివిధానాలను తెలుసుకునేలా వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నపత్రం
☛ ఓఎమ్మార్‌లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు
☛ తక్కువ అర్హతలున్న వారికే స్క్రయిబ్‌లుగా అనుమతి
➤ APPSC Group 1 Prelims Exam Day Tips & Tricks : గ్రూప్-1 ప్రిలిమ్స్.. లాస్ట్ మినిట్ టిప్స్ ఇవే..
☛ APPSC & TSPSC : గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ముఖ్యమైన టాఫిక్స్ ఇవే..