APPSC Prelims: ప్రిలిమ్స్‌లో రెండు ప్రశ్నలు డిలీట్ చేసిన ఏపీపీఎస్సీ... ఆ రెండు ఏవంటే...
అభ్యర్థుల సామర్థ్యాలను వెలికితీసేలా పేపర్‌ను రూపొందించారని కొంతమంది అభ్యర్థులు అభిప్రాయపడితే.. మరికొంతమంది పేపర్ కొంచెం కఠినంగా ఉందని పెదవి విరిచారు. మొత్తానికి పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూడాల్సిన స్థితి నెలకొంది. అయితే పరీక్ష రాసిన తర్వాత తమకు ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకునేందుకు ఏపీపీఎస్సీ అధికారికంగా తమ వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ ని అందుబాటులో ఉంచింది.
పేపర్–1లో ఒక ప్రశ్నను, పేపర్–2లో ఇంకో ప్రశ్నను ఏపీపీఎస్సీ తొలగించింది. ప్రశ్న తప్పుగా పరిగణిస్తే ఆ ప్రశ్నకు మార్కులను జత చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా తప్పుగా ఉన్న రెండు ప్రశ్నలను ఏపీపీఎస్సీ తొలగించేసింది.
ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి
పేపర్–1లో.... ఈ క్రింది వానిలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ లక్షణము కానిది ఏది.?
పేపర్–2లో.... 2009 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఏ సంవత్సరానికి ఒకే విధంగా ఉంటుంది.?
పై రెండు ప్రశ్నలను ఏపీపీఎస్సీ తొలగించేసింది. అలాగే ప్రాథమిక కీ లో అభ్యంతరాలుంటే జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చు.