Skip to main content

ATM Cash Withdrawal New Rule : రూల్స్‌ మారాయ్‌..వాటి గురించి మీకు తెలుసా..?

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్‌ నేరస్తులు బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు.
SBI ATM Cash Withdrawal New Rule
SBI ATM Cash Withdrawal New Rule

ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఎస్‌బీఐ వినియోగదారుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్‌లలో జరిగే మోసాల్ని అరికట్టేందుకు వన్‌ టైమ్‌ పాస్‌ వర్డ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఏటీఎం సెంటర్‌లలో జరిగే సైబర్‌ నేరాల్ని నివారించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లలో కొత్త రూల్..
☛ ఏటీఎం సెంటర్‌లలో రూ.10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేసే వారికోసం ఎస్‌బీఐ ఈ కొత్త ఓటీపీ రూల్ ను అమలు చేస్తోంది. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  
☛ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లలో 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 
☛ ఏటీఏం సెంటర్‌లో బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్‌లు ఏటీఎం మెషీన్‌లో డెబిట్‌ కార్డ్‌ ఇన్‌ సర్ట్‌ చేసిన తరువాత కార్డ్‌ పిన్‌, విత్‌ డ్రాల్‌ అమౌంట్‌ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్‌ చేయాలని అడుగుతుంది. 
☛ ఆ సమయంలో మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 
☛ ఇక ఈ ఓటీపీని అనేది ఒక్క విత్‌ డ్రాల్‌కి మాత్రమే పనిచేస్తుంది. రెండో సారి విత్‌ డ్రాల్‌ చేయాలంటే మరో కొత్త ఓటీపీని ఎంటర్‌ చేయాలని ఎస్‌బీఐ తెలిపింది.

Published date : 30 Oct 2021 01:39PM

Photo Stories