Skip to main content

6G (Network): 6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్...

మన దేశంలో ఇంకా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది.
6g network specifications
6g network specifications

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్‌జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 

5జీ వేగం ఇలా..
5జీ నెట్‌వర్క్ గరిష్టంగా 20 జీబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందుకోగలదు. భారతదేశంలో 5జీ నెట్‌వర్క్ స్పీడ్ టెస్టింగ్ సమయంలో డౌన్‌లోడ్ గరిష్ట వేగం 3.7 జీబీపీఎస్ చేరుకుంది. ఎయిర్ టెల్, వీఐ, జియో కంపెనీలు 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌లో 3 జీబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ వేగాన్ని అందుకున్నట్లు పేర్కొన్నాయి. (చదవండి: రూ.69 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా అదుర్స్!)

6జీ వేగం య‌మ స్పీడ్‌..
6జీ వైర్ లెస్ టెక్నాలజీ ఆరవ తరం. 6జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్ వేగం 1000 జీబీపీఎస్ కి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎల్‌జీ సంస్థ ఇటీవల జర్మనీలో 6జీ నెట్‌వర్క్‌ ట్రయిల్స్ ప్రారంభించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. ఈ నివేదిక ప్రకారం, ట్రయల్స్‌లో 100 మీటర్ల దూరంలో డేటాను పంపించడంతో పాటు స్వీకరించారు. 6జీ నెట్‌వర్క్‌ సహాయంతో సెకనుకు 1000 మెగాబైట్ల వేగంతో కేవలం 51 సెకన్లలో 6జీబీ మూవీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

6జీ నెట్‌వర్క్‌ ముఖ్యాంశాలు..
☛ 6జీ నెట్‌వర్క్‌ వేగం 5జీ కంటే 50 రెట్లు అధికం 
☛ జపాన్‌లో 6జీ నెట్‌వర్క్‌ 2030 నాటికి ప్రారంభించవచ్చు.
☛ జపాన్‌తో పాటు, దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6జీ నెట్‌వర్క్‌ కోసం సిద్ధమవుతున్నాయి. 
☛ యూరోపియన్ యూనియన్‌లో 6జీ నెట్‌వర్క్‌ కోసం మిలియన్ల యూరోలు ఖర్చు చేస్తున్నారు.

ఇంకా 5జీ రాక‌ముందే..6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం..ఎందుకంటే..?

Published date : 02 Nov 2021 01:14PM

Photo Stories