Kerala: ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోన్న జీవో... యూ ట్యూబ్ చానల్ ఉంటే ఉద్యోగం ఊస్టింగే...
ఇంటర్‌నెట్ ప్రతి ఒక్కరికి చేరువైంది. ప్రతి ఒక్కరూ తమ ట్యాలెంట్‌ను బాహ్య ప్రపంచానికి చూపించడం మొదలు పెట్టారు. ఇందుకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటున్నారు. ఎటుచూసినా యూ ట్యూబ్ చానెళ్లే దర్శనమిస్తున్నాయి. వీడియోలు తీయడం వాటిని తమ యూ ట్యాబ్ చానెళ్లలో అప్‌లోడ్ చేయడం ఇదే పరిపాటైంది. కొంతమంది ఇలానే కోట్లు సంపాదిస్తున్నారు. మరికొంతమంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు(యూనిఫాం ఉద్యోగులు)తమ కొలువులను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వాటికి కేరళ చెక్ పెట్టింది.
చదవండి: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...
ఇకపై అలా చెల్లదు...
ప్రభుత్వ విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానల్‌ను నడపరాదంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కొందరు ఉద్యోగులు వంటలు, కామెడీ కార్యక్రమాల వీడియోలు అప్‌లోడ్ చేసి రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ అదనపు ఆదాయ మార్గంపై వేటు వేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానల్స్‌ను నిర్వహించవద్దంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో పేర్కొంది.